కొందరి జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి.ఎదుటి వారిని చూసి.
అబ్బో వారికేంటి? మస్త్ సంపాదిస్తున్నారు అనుకుంటారు.కానీ, వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి అంతగా తెలియదు.
డబ్బుల కోసం వారు పడిని కష్టం ఏంటో అవగాహన ఉండదు.నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది.
సమస్యల సుడిగుండంలో నుంచి మంచి నటుడిగా ఎదిగిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
బొమ్మన్ ఇరానీ! అత్తారింటికి దారేది సినిమాలో తన నటనతో వారెవ్వా అనిపించాడు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తాత క్యారెక్టర్ లో ఇరగదీశాడు.తను సినిమాల్లోకి రాకముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు.42 ఏండ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన ఆయన.ఎన్నో ప్రాబ్లెమ్స్ అధిగమిస్తూ వచ్చాడు.సినీ పరిశ్రమలోకి రాక ముందు బొమ్మన్ హోటల్లో వెయిటర్‌గా పనిచేశాడు.
నిజానికి బొమ్మన్ బాల్యం అంతా కష్టల కడలిలోనే కొట్టుమిట్టాడింది.తను పుట్టడానికి 6 నెలల ముందే తండ్రిని కోల్పోయాడు.
తల్లి కష్టపడి తనను పెంచింది.చిన్నప్పటి నుంచే బొమ్మన్‌కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం.
అక్కడా ఇక్కడా పనులు చేసి.సంపాదించిన డబ్బుతో ఓ కెమెరా కొనుక్కున్నాడు.
అందమైన ఫోటోలను తీసి.కడిగించి 20 లేదా 30 రూపాయలకు అమ్మేవాడు.
ఫోటోగ్రఫీ ద్వారా వచ్చిన డబ్బుతో ముంబైలో వెయిటర్ కోర్సు చదివాడు.అనంతరం ముంబై తాజ్ హోటల్లో చేరాడు.2 ఏండ్లు వెయిటర్‌గా పని చేశాడు.అదే సమయంలో చిన్న బేకరీ ఓపెన్ చేశాడు.
వెయిటర్‌గా పని చేస్తున్న సమయంలో ఓ కొరియోగ్రఫర్‌తో పరిచయం ఏర్పడింది.ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చేలా ప్రయత్నించాడు.
కొంత కాలం తర్వాత యాడ్స్‌లో నటించే ఛాన్స్ దక్కిచుకున్నాడు.నెమ్మది నెమ్మదిగా సినిమాల్లో అడుగు పెట్టి.
మంచి అవకాశాలు పొందాడు.

2009లో బొమ్మన్ ప్రొడక్షన్ హౌస్‌ను ఓపెన్ చేశాడు.ఎన్నో సినిమాలు ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా రూపొందిస్తున్నారు.మొత్తంగా కష్టాల నుంచి రాటుదేటిన బొమ్మన్.
సినిమాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు.