యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం దేవర సినిమా ( Devara Movie ) సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 6 సంవత్సరాల అవుతుంది.
ఇలా ఆరు సంవత్సరాల తర్వాత దేవర అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు.ఇక ఈ సినిమాకు మూడు రోజులలోనే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేవర సినిమా ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో కూడా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ షోలో కూడా సందడి చేశారు.
ఇలా ముంబైలో కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఎన్టీఆర్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు.సాధారణంగా భార్యాభర్తలు అంటే గొడవలు ఉండటం సర్వసాధారణమే అలాగే ఎన్టీఆర్ ప్రణతి( Pranathi ) మధ్య తరచూ జరిగే గొడవల గురించి ఈ కార్యక్రమంలో ఈయన తెలియజేశారు.తనకు లక్ష్మీ ప్రణతికి ప్రతిరోజు ఏసి టెంపరేచర్ ( AC Temparature ) విషయంలో గొడవ జరుగుతుందని ఎన్టీఆర్ వెల్లడించారు.
పాపం ప్రణతి నాకోసం ప్రతి రోజు కాంప్రమైజ్ అవుతుంది అంటూ ఈ సందర్భంగా తన భార్యతో తనకు జరిగే గొడవ గురించి ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రణతి ఎన్టీఆర్ జంటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఎన్టీఆర్ కంటే వయసులో 9 సంవత్సరాలు ప్రణతి చిన్నది అయినప్పటికీ వీరి జోడి మాత్రం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.
ఇక ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు అనే సంగతి మనకు తెలిసిందే.ఇక ప్రణతి మాత్రం నిత్యం తన కుటుంబ వ్యవహారాలను తన పిల్లల బాధ్యతలను చక్కబెడుతూ ఉంటారు.
ఇక సోషల్ మీడియాకి కూడా ప్రణతి చాలా దూరం అనే సంగతి మనకు తెలిసిందే.