వేలు పెట్టకుండా ఉంటే దేవర లాంటి ఫలితాలే వస్తాయి... ప్రముఖ రచయిత షాకింగ్ కామెంట్స్!

కొరటాల శివ( Koratala Shiva ) ఎన్టీఆర్( NTR ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం దేవర( Devara ) ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా మూడు రోజులలోనే సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టిస్తుంది.

 Ramajogayya Sastri Sensational Comments On Devara Success Details, Devara,ntr,ko-TeluguStop.com

దేవర సినిమా భారీ స్థాయిలో హిట్ అందుకోవడంతో మెగా హీరోలపై భారీ స్థాయిలో కామెంట్ లు వినపడుతున్నాయి.దేవరకంటే ముందు కొరటాల ఆచార్య( Acharya ) సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఎలాంటి డిజాస్టర్ అయిందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో చిరంజీవి అప్పట్లో చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

Telugu Acharya, Devara, Koratala, Heroes, Chiranjeevi, Ntr Devara, Ram Charan-Mo

ఇక ఈ మాటలకు కొరటాల మౌనం వహిస్తూనే దేవర సినిమాతో తన సమాధానం చెప్పారు.ఇక దేవర ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరైన కొరటాల చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.మన పనినీ మనల్ని చేసుకొనిస్తే చాలు పక్కోడొచ్చి వేలు పెడితే చెడిపోతుంది అంటూ కామెంట్లు చేయడంతో తప్పకుండా చిరంజీవిని( Chiranjeevi ) ఉద్దేశించే ఈయన ఈ కామెంట్లు చేశారని అందరూ భావించారు.

Telugu Acharya, Devara, Koratala, Heroes, Chiranjeevi, Ntr Devara, Ram Charan-Mo

ఇకపోతే దేవర సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గీత రచయిత రామ జోగయ్య( Rama Jogayya ) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ఇలాంటి ఒక మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ మన పనిలో వేరే వాళ్ళు వేలు పెట్టకుండా ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి అంటూ కామెంట్స్ చేశారు.దీంతో ఈయన చేసిన కామెంట్స్ కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేశారంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube