దేశవ్యాప్తంగా బీఆర్ఎస్( BRS ) ను విస్తరించే ప్రయత్నం చేసిన ఆ పార్టీ అధినేత కేసిఆర్ కు కాలం కలిసి రాలేదనే చెప్పాలి.ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, తెలంగాణలోనే బీఆర్ఎస్ ఓటమి చెందడంతో, ఆ ప్రభావం మిగిలిన రాష్ట్రాల పైన పడింది.
ప్రస్తుతం తెలంగాణలోని పార్టీ వ్యవహారాలను కెసిఆర్ అంతగా పట్టించుకోవడం లేదు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, కెసిఆర్ మేనల్లుడు మాజీ మంత్రి హరీష్ రావులే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని చాటేందుకు రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మహారాష్ట్ర, ఒడిస్సా ,ఏపీలోనూ బీఆర్ఎస్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
రాష్ట్ర అధ్యక్షుల నియామకమూ చేపట్టారు.అయితే ఇంతలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, అక్కడ ఓటమి చెందడంతో మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలపై అంతగా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టలేకపోయింది.దీంతో ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకగా మారింది.పార్టీ క్యాడర్ కూడా దూరమయ్యారు.పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రమే గానే జరుగుతున్నాయి.కేసీఆర్( KCR ) కూడా సైలెంట్ కావడంతో, ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతున్నట్లు అర్థమవుతుంది .మరికొద్ది రోజుల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు తో పాటు, పార్టీ కీలక నేతలు ఈరోజు ఎన్సిపి అధినేత శరద్ పవార్ ( Sharad Pawar )ను కలవనుండడం తో ఎన్సీపీలో బీఆర్ఎస్ వీలైన కాబోతోందని ప్రచారం జరుగుతోంది అక్టోబర్ ఆరవ తేదీన పూణేలో ఎన్సీపీ( Nationalist Congress Party ) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలంతా ఎన్సీపీలో చేరుతారని ఆ పార్టీని ఎన్సిపిలో విలీనం చేయబోతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.ఇక మిగిలిన రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉండబోతోందట.