వృత్తి, ఉద్యోగ , వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్ధితులను మనదేశంతో పోల్చిచూసుకుంటూ ఉంటారు.వారు తెలుసుకున్న అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు.
తాజాగా కెనడాలో( Canada ) ఓ భారతీయుడు.స్థానిక కిరాణా స్టోర్స్‌ను( Grocery Stores ) వినియోగదారులు ఎలా మోసం చేస్తున్నాయో కళ్లకు కట్టినట్లు వివరించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గుజరాతీ మాట్లాడుతోన్న ఆ వ్యక్తి .మార్కెట్‌ను ఎలా మోసం చేయొచ్చో వివరించాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో అతను తన పేరును నిసు.పిగా పేర్కొన్నాడు.
సదరు వీడియోలో అతను స్టోర్‌లోని యాపిల్స్‌పై( Apples ) ప్రైజ్ స్టిక్కర్లను మార్చడం చూడొచ్చు.డబ్బు ఎలా ఆదా చేయాలో మీకు నేర్పిస్తానంటూ తక్కువ రేటున్న యాపిల్స్‌కి అతికించిన స్టిక్కర్స్‌ని పీకి , మంచి క్వాలిటీ ఉన్న యాపిల్స్‌పై అతికించాడు.
అతని వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.కొందరు నెటిజన్లు ఈ వీడియో స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ అతనిపై మండిపడుతున్నారు.
నీ ఇన్‌స్టాగ్రామ్‌కి వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కిరాణా స్టోర్స్‌ని ఎలా స్కామ్( Scam ) చేయాలో చూపిస్తావా అంటూ చీవాట్లు పెడుతున్నాడు.నీలాంటి వాళ్ల వల్ల వలసదారులు బహిష్కరణకు గురవుతున్నారని చురకలంటించారు.ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను తక్షణం ఇండియాకు బహిష్కరించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఆన్లైన్లో ట్రెండ్ అవుతోన్న మరో వీడియోలో ఓ ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ .జపాన్‌లోని లోకల్ ట్రైన్లను పరిచయం చేశాడు.టెక్నాలజీకి, ఆధునిక సదుపాయాలకు కేరాఫ్‌గా ఉండే జపాన్‌లో హై స్పీడ్, బుల్లెట్ ట్రైన్లు అందరికీ తెలిసిందే.
అయితే వాటికి ఏమాత్రం తీసిపోని రేంజ్లో అక్కడి లోకల్ ట్రైన్లు వున్నాయని భారతీయ ట్రావెలర్ రౌనక్ సాహ్ని తెలిపారు.
లోకల్ జపాన్ రైలు సాధారణ ప్రయాణానికి భిన్నంగా ఉంటుందని కంపార్ట్మెంట్లు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటాయని తెలిపాడు.
సాంప్రదాయ జపనీస్ శైలి సీట్లతో పాటు కోచ్‌ల లోపల ఇంటీరియర్ అద్భుతంగా ఉందని సాహ్ని వివరించాడు.