చైనా: వావ్, తవ్వకాలలో బయటపడ్డ అపారమైన బంగారు నిధి..

ప్రపంచవ్యాప్తంగా భూములను తవ్వుకుంటూ పోతే వాటి కింద ఎన్నో విలువైన బంగారు ఆభరణాలు ఇతర లోహాల ఆభరణాలు కచ్చితంగా దొరుకుతాయి.అప్పట్లో ప్రజలకు బ్యాంకింగ్ సిస్టం లేక నేలలో బంగారాన్ని దాచి పెట్టేవారు.

 China: Wow, Huge Gold Treasure Unearthed In Excavations, Sanxingdui Ruins, Archa-TeluguStop.com

ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఆపారమైన బంగారం నిధులు బయటపడి చాలామందిని ఆశ్చర్యపరిచాయి అయితే ఇప్పుడు మరొక గోల్డెన్ ట్రెజర్ బయటపడింది.అది కూడా చైనా దేశంలో!వివరాల్లోకి వెళితే, చైనా( China )లోని సాంక్సింగ్డుయి శిథిలాల వద్ద తాజాగా ఒక అద్భుతమైన నిధి కనుగొనబడింది.

ఈ నిధి 10,000 సంవత్సరాల కంటే పురాతనమైనది.అక్కడ తవ్వకాలు చేస్తున్నపుడు, భూమిలో నుంచి ఒక నాకింగ్ సౌండ్ వినిపించింది.

ఏంటా అని మరింత లోతుగా తవ్వినపుడు, ఈ నిధి మెరుస్తూ బయటపడింది.సుమారు 7,400 వస్తువులు కనుగొనబడ్డాయి.

వీటిలో వేలాది బంగారు ఆభరణాలు, విగ్రహాలు, పాత్రలు, కొన్ని గోల్డెన్ మాస్క్‌( Golden Mask )లు ఉన్నాయి.ఈ నిధి చైనాలోని మొట్టమొదటి రాజవంశమైన షాంగ్ వంశం చివరి రోజులలో పాతి పెట్టినట్లు భావిస్తున్నారు.

Telugu Treasure, Chinese, Gold Artifacts, Nri, Shu Empire-Telugu NRI

చారిత్రక ప్రదేశాన్ని చాలా కాలం క్రితం, 1920లలో కనుగొన్నారు.ఇది చాలా పాత సామ్రాజ్యమైన (షు సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేదని అనుకుంటున్నారు.ఈ ప్రదేశంలో చాలా విలువైన బంగారు, వెండి వస్తువులు దాచబడి ఉన్నాయి.కానీ ఈ వస్తువులను ఎవరు దాచారు, ఎందుకు దాచారు అనే విషయాలు ఇంకా తెలియదు.

ఈ వస్తువులు ఎంత ముఖ్యమైనవో కూడా పూర్తిగా తెలియ రాలేదు.కొన్నేళ్ల క్రితం, శాస్త్రవేత్తలు ఈ ప్రదేశం చుట్టూ తవ్వకాలు చేసి చాలా పురాతన వస్తువులను కనుగొన్నారు.

Telugu Treasure, Chinese, Gold Artifacts, Nri, Shu Empire-Telugu NRI

ఈ నిధిలో చాలా గోల్డెన్ మాస్క్‌లు లభించగా, వీటిలో నాలుగు మాస్క్‌లు చాలా పెద్దవి, దాదాపు 8 అంగుళాల వెడల్పు ఉన్నాయి.అన్ని మాస్క్‌లు బంగారంతోనే చేయబడ్డాయి, కానీ ప్రతి మాస్క్‌ కొంచెం వేరుగా ఉంది. ఈ తవ్వకాల్లో బంగారు పూతతో చేసిన సుమారు 420 వస్తువులు లభించాయి. వీటిలో చాలా వస్తువులు వంగిపోయాయి కానీ శాస్త్రవేత్తలు వాటిని గుర్తించగలిగారు.కొన్ని వస్తువులు చేపల ఆకారంలో ఉంటే, మరికొన్ని ఈకలు లేదా పక్షులను పోలి ఉంటాయి.ఒక పొడవైన బంగారు బెల్టు కూడా లభించింది.

ఒక కుక్కను పోలి ఉండే దైవిక జంతువు విగ్రహం వంటి కొన్ని వస్తువులు దెబ్బతిన్న స్థితిలో లభించాయి.సుమారు 400 ఏనుగు దంతాల ముక్కలు కనుగొనబడ్డాయి.వీటిలో అతి పొడవైన దంతం 1.4 మీటర్ల పొడవు ఉంది.దాదాపు సగం దంతాలు 50 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.మొత్తం మీద ఈ ప్రదేశంలో చాలా విలువైన వస్తువులు దొరుకుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube