ప్రస్తుత రోజులలో చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో చిన్నపిల్లలు చేసే ఫన్నీ వీడియోలు, పెద్దవారు చేసే ఫన్నీ వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.
అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పెద్దాయన ఆసుపత్రిలో చేసిన పనికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
అసలు మేటర్ ఏంటంటే.
ఒక పెద్దాయన హాస్పిటల్ కి వెళ్లాడు.ఈ క్రమంలో వైద్యుడు అతడికి ఎమ్ఆర్ఐ స్కాన్‌ను (MRI scanning)చేయాలని సూచించారు.దీంతో స్కానింగ్ మిషన్ పై పడుకున్నాడు ఆ పెద్దాయన.
వైద్యుడు వచ్చి స్కానింగ్ మిషన్ లోపలికి పంపాల్సి ఉంది.కానీ ఇంతలో ఆ పెద్దాయన ఏం చేయాలనుకున్నాడో ఏమో కానీ.
వెంటనే తన జేబులో నుంచి ఎంచక్కాక కైనీ ప్యాకెట్(Kaini packet) కు బయటకు తీసి ఓపెన్ చేసి చేతిలో వేసుకొని మరి బాగా రుద్ది నోట్లోకి వేసుకున్నాడు.ఇదంతా కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి స్మార్ట్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.
దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
అలాంటి చెడు వ్యసనాలు వల్లనే కదా తాత ఆసుపత్రికి వచ్చావు.మళ్లీ అక్కడ కూడా అదే పని అని చేస్తున్నావేంటి అని కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు ఆరోగ్యం జాగ్రత్త తాత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.