సినిమా ఇండస్ట్రీలో దేవుళ్ళ కాన్సెప్ట్ తో ఎన్నో రకాల సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.అందులో కొన్ని సినిమాలు హనుమాన్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు హనుమాన్ (hanuman) పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.మరి సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎవరెవరు హనుమాన్ పాత్రలో నటించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రశాంత్ వర్మ (Prashant Verma)దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న జై హనుమాన్ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి(rishab shetty) నటించబోతున్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ లో(Adipurush) ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే(Devdatta Nag).
హనుమంతుడి పాత్రలో నటించాడు.అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు.
ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారు.కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు.
కమలాకర కామేశ్వర(Kamalakara Kameswara) రావు తీసిన వీరాంజనేయ చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు.

అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు.ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు.అలా శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్ చిత్రాలు ఈ నాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి.
తెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు రాజనాల కాళేశ్వర రావు.అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం.

నటుడిగా, దర్శకుడిగా అటు రాజకీయాల్లోనూ రాణించారు దార సింగ్(Dara Singh).ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్ ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు.భజరంగబలి చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించారు.
ఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఒక ఫైట్ పోర్షన్ లో హనుమాన్‌గా అలరించారు.
ఇలా చాలామంది నటులు హనుమాన్ పాత్రలో నటించి మెప్పించారు.