చైనా, జపాన్ కంట్రీలు మాత్రమే కాకుండా సౌత్ కొరియా కంట్రీ కూడా చాలా డెవలప్ అయ్యింది.అక్కడి మౌలిక సదుపాయాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.
భారతీయులు(Indian) ఇక్కడి టెక్నాలజీ గురించి అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తుంటారు.తాజాగా మరో ఇండియన్ కంటెంట్ క్రియేటర్ దక్షిణ కొరియాలో ప్రజలు ఎంత ఈజీగా తమ ఇళ్లు మారుతున్నారో చూపించే ఒక ఆసక్తికరమైన వీడియోను తయారు చేశారు.
వందల అంతస్తులు ఉన్న భవనాల్లో నివసించే వారు తమ పెద్ద పెద్ద వస్తువులను ఎలా సులభంగా మరొక ఇంటికి తరలిస్తున్నారో ఆ వీడియోలో చూపించారు.
దక్షిణ కొరియాలోని (South Korea)ప్రజలు, తమ ఇళ్లకు బయటే ఒక రకమైన లిఫ్ట్‌ను ఉపయోగిస్తారు.
ఈ లిఫ్ట్ గోడలపైకి ఎక్కేలా ఉంటుంది.అంటే, మనం ఇళ్లలో ఉపయోగించే లిఫ్ట్‌లా కాకుండా, ఈ లిఫ్ట్‌ను భవనం గోడకు ఆనించే ఒక నిచ్చెన లాగా ఉంటుంది.
ఈ లిఫ్ట్ ద్వారా పెద్ద పెద్ద వస్తువులు కిటికీ ద్వారా నేరుగా ఇంటి నుంచి బయటికి తీసుకెళ్తారు.ఈ లిఫ్టు లాంటి నిచ్చెన అనేది ఒక ట్రక్కుకి అటాచ్ అయి ఉంటుంది.
వచ్చిన వస్తువులన్నీ ఆ ట్రక్కులో పేరుస్తారు.ఇలా చేయడం వల్ల, ఎలివేటర్లు లేదా కారిడార్లలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
అంతేకాకుండా, దక్షిణ కొరియాలో చాలా కొత్త భవనాల కిటికీలను తొలగించి, మళ్లీ అమర్చేలా చేస్తారు.అందుకే ఈ విధంగా బొమ్మలు తరలించడం చాలా సురక్షితం.
కంటెంట్ క్రియేటర్(content creator) చెప్పినట్లు, ఈ విధంగా వస్తువులు తీసుకెళ్లడం చాలా వేగంగా జరిగిపోతుంది.దక్షిణ కొరియాలోని పట్టణాలు చాలా రద్దీగా ఉండటం వల్ల ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇప్పటివరకు చూసిన విధానాలు చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, దక్షిణ కొరియాలోని ఈ విధానం మాత్రం చాలా మోడర్న్ గా ఉందని చెప్పుకోవచ్చు.ఆ వీడియో సోషల్ మీడియాలో 5 లక్షలకు పైగా మంది చూశారు.
చాలామంది ఆశ్చర్యపోయి, “వావ్, ఈ దేశం 2040లో ఉన్నట్లుంది!” అని కామెంట్ చేశారు.మరికొందరు, “ఇలా చేస్తే చాలా సమయం ఆదా అవుతుంది, గొడవలు కూడా ఉండవు” అని అన్నారు.కొంతమంది మనదేశంలో ఇలాంటి పద్ధతి ఎఫెక్టివ్ గా ఉండదని అన్నారు.“మన దేశానికి ఇది వచ్చినా కూడా ఎవరూ ఉపయోగించరు” అని కూడా పేర్కొన్నారు.
మనదేశానికి చెందిన మరికొందరు ఈ పద్ధతికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు.“ఆ మెషీన్ ధర ఎంత?” అని అడిగారు.ట్రేడ్‌కొరియా అనే వెబ్‌సైట్ ప్రకారం, ఆ మెషీన్ ధర కంపెనీని బట్టి, ఎంత ఎత్తు వరకు ఎత్తగలదు, ఎంత బరువు మోయగలదు, హైడ్రాలిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ఉందా లేదా వంటి విషయాలను బట్టి మారుతుంది.