దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.అయితే దీపావళి వేడుకలలో భాగంగా సంబరాలు చేసుకుంటున్న ఒక ఇంట్లో జరిగిన తుపాకీ(gun) కాల్పులకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఢిల్లీలోని షాహదారా ప్రాంతంలోని బిహారీ కాలనీలో దీపావళి వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు నిర్వహించారు.
ఇందులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.ఒక బాలుడు గాయపడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఈ దారుణమైన సంఘటన మొత్తం అక్కడే ఉన్న సిసి ఫుటేజ్ లో రికార్డు అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మృతులు ఆకాష్(Akash), అతని మేనల్లుడు రిషబ్(Rishabh) గా గుర్తించారు పోలీసులు.ఈ కాల్పులలో భాగంగా అతని కుమారుడు క్రిష్ తీవ్ర గాయాలైనాయని, సంఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.వాస్తవానికి వారిపై ఐదు రౌండ్ల బులెట్లు పేల్చారని సిసిఫుటేజ్ ఆధారంగా ఒక మైనర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇది కేవలం వ్యక్తిగత శత్రుతత్వమే అని ప్రాథమిక విచారణలో తేలినట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలియజేశారు.ప్రాథమిక విచారణలో భాగంగా ఐదు రౌండ్ల బుల్లెట్లు పేలినట్లు గుర్తించామని డిఎస్పి షహదారా ప్రశాంత్ గౌతమ్(DSP Shahdara Prashant Gautam) తెలియజేశాడు.
ఈ క్రమంలో మృతి చెందిన ఆకాష్ తల్లి మాట్లాడుతూ.దుండగుడు లక్ష్మణ్ చెప్పింది.అతను గత కొన్ని రోజులుగా తన ఇంటికి వస్తున్నాడని దీపాలు ఈ రోజున స్వీట్ బాక్స్ లతో ఇంటికి వచ్చాడని, ఆమె కొడుకు ఇంటి బయట క్రాకర్లు కాలుస్తున్న క్రమంలో ఆకాష్ అక్కడికి వచ్చిన లక్ష్మణ్ ని చూసి ఇంట్లోకి పరుగులు తీశాడు.
అయినా కానీ.లక్ష్మణ్ ఆకాష్(Laxman Akash) ఇంట్లోకి చొరబడి కాల్పులు నిర్వహించారని, భారీ శబ్దాలను విని ఇంట్లో నుంచి అందరం బయటకు వచ్చే చూసేసరికే రక్తపు మడుగులో ఆకాష్, రిషబ్, క్రిష్ పడి ఉన్నారని తెలియజేసింది.ఇది ఇలా ఉండగా.
మరోవైపు ఆకాష్ సోదరుడు రిషబ్ తండ్రి యోగేష్ ఆ ఆకాష్ కి ఒకరితో వివాదం ఉందని తెలియజేశాడు.సంఘటన సమయంలో గుర్తు తెలియని వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులు వచ్చారని బైకుపై ఉన్న వ్యక్తి నా తమ్ముడని, నా కొడుకును హత్య చేశాడని తెలిపాడు.
గత కొద్ది రోజులుగా మా అన్నకు డబ్బు విషయంలో ఒకరితో గొడవ జరిగిందని ఆకాష్ తండ్రి తెలియజేశాడు.ఏది ఏమైనా కానీ.
పండగ రోజు ఇలా జరగడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.ప్రస్తుతం ఈ కాల్పులకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.