టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఇటీవల కొరటాల శివ దర్శకత్వం (Director Koratala Shiva)వహించిన దేవర(Devara) మూవీతో ప్రేక్షకులను పలకరించారు.ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.
కాగ జూనియర్ ఎన్టీఆర్ మొదట నిన్ను చూడాలని చిత్రంతో కెరీర్ ను ప్రారంభించి నేడు పాన్ ఇండియా హీరోగా ఎదిగారు.
![Telugu Devara, Koratala Shiva, Flop, Hrithik Roshan, Ntr, Tarak, War-Telugu Top Telugu Devara, Koratala Shiva, Flop, Hrithik Roshan, Ntr, Tarak, War-Telugu Top](https://telugustop.com/wp-content/uploads/2024/11/Junior-NTRs-sensational-comments-about-his-flop-movies-What-actually-happened-b.jpg)
దేవర, ఆర్ఆర్ఆర్(Devara , RRR) చిత్రాలు తారక్ ని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టాయి.ఇండియాలో సినిమాలు, క్రికెట్ ఈ రెండు ఎక్కువగా ప్రజలని ఎంటర్టైన్ చేస్తుంటాయి.ఎన్టీఆర్(NTR) కూడా క్రికెట్ బాగా ఫాలో అవుతారట.
ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన కెరీర్ ని క్రికెట్ తో పోల్చుకున్నారు తారక్.ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.
ఇప్పుడు చాలా మంది మంచి క్రికెటర్స్ ఉండి ఉండవచ్చు, కానీ నాకు మాత్రం క్రికెట్(Cricket) లో సచినే హీరో.క్రికెటర్స్ అంటే నేషనల్ హీరోలు.
వాళ్ళ బయోపిక్ చిత్రాల్లో నటించాలి అంటే గట్స్ ఉండాలి.క్రికెటర్ల బయోపిక్ చిత్రాల్లో నటించేంత ధైర్యం నాకు లేదు.
ఎంఎస్ ధోని (MS Dhoni)బయోపిక్ చిత్రం అద్భుతంగా ఉంది అని తెలిపారు తారక్.
![Telugu Devara, Koratala Shiva, Flop, Hrithik Roshan, Ntr, Tarak, War-Telugu Top Telugu Devara, Koratala Shiva, Flop, Hrithik Roshan, Ntr, Tarak, War-Telugu Top](https://telugustop.com/wp-content/uploads/2024/11/Junior-NTRs-sensational-comments-about-his-flop-movies-What-actually-happened-a.jpg)
మీ కెరీర్ లో ఫస్ట్ సిక్సర్ ఏదని యాంకర్ ప్రశ్నించగా.దీనికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ.కాస్త అలోచించి నా కెరీర్ లోనే ఫస్ట్ సిక్సర్ అంటే సింహాద్రి చిత్రం.
సింహాద్రి(Simhadri) సక్సెస్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.ఆ తర్వాత కూడా చాలా సిక్సర్లు కొట్టారు అని యాంకర్ అన్నారు.
సిక్సులే కాదు భయంకరమైన డకౌట్లు కూడా అయ్యాను అంటూ ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్రాల గురించి ప్రస్తావించాడు.కానీ వయసు పెరిగే కొద్దీ సక్సెస్ ని ఫెయిల్యూర్ ని సమానంగా తీసుకోవడం ప్రారంభించాను అని తెలిపారు.
ప్రస్తుతం తారక్ హృతిక్ రోషన్(Tarak Hrithik Roshan) తో కలసి వార్ 2 (War 2)లో నటిస్తున్న విషయం తెలిసిందే.దేవర తర్వాత తారక్ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ఇదే.వచ్చే ఏడాది ఆగష్టు లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.