ఈ రోజుల్లో ఎలాన్ మాస్క్(Elon Mask) చాలామంది యువతకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.ఆయన కంపెనీలో పనిచేసి ఆయనలాంటి వర్క్ ఎథిక్స్ నేర్చుకోవాలని భావిస్తున్నారు.
మస్క్ లాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే మైండ్ సెట్ ఏర్పరుచుకోవాలని భావిస్తారు.పుణెకి చెందిన ధ్రువ్ లోయా(Dhruv Loya) కూడా అలానే భావించాడు.
ఆ కళను నెరవేర్చుకోవడానికి చాలానే కష్టపడ్డాడు చివరికి తన డ్రీమ్ కంపెనీ అయిన టెస్లాలో ఉద్యోగం సంపాదించాడు.
ధ్రువ్(Dhruv) అమెరికాలోని బఫెలో యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.
తర్వాత ఐదు నెలల పాటు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డాడు.ఈ కాలంలో 300 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు, 500 కంటే ఎక్కువ మందికి ఈమెయిల్స్ పంపాడు, 10 ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
కాలేజీలో చాలా బాగా చదివాడు, ఇంటర్న్‌షిప్స్ చేశాడు, రోయింగ్, డాన్స్ (Internships, Rowing, Dance)లాంటి కార్యక్రమాలలో పాల్గొన్నాడు.అయినప్పటికీ, ఉద్యోగం దొరకక కొంత కాలం ఇబ్బంది పడ్డాడు.
చివరికి టెస్లాలో పవర్‌వాల్ టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగం దొరకడంతో తన సంతోషాన్ని లింక్డ్ఇన్‌లో పంచుకున్నాడు.
ధ్రువ్ లోయా మొదట డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాడు, అద్దె ఇల్లు కోల్పోయాడు, హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా పోయింది.తన వీసా గురించి అనిశ్చితి కూడా ఆయనకు ఎంతో ఒత్తిడిని కలిగించింది.ఈ కష్ట కాలంలో స్నేహితుల ఇళ్లలో ఉంటూ, ఎయిర్ మ్యాట్రెస్‌లపై నిద్రపోయాడు.
అయినప్పటికీ, ధ్రువ్ నిరుత్సాహపడకుండా ఉద్యోగం కోసం ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాడు.ఉద్యోగం కోసం వారం రోజులు పూర్తి కాలం పని చేసినట్లుగా కష్టపడి, వారాంతాల్లో మనసుకు విశ్రాంతిని ఇచ్చారు.
ధ్రువ్ ఇంటర్వ్యూలు దొరకడానికి తాను ఉపయోగించిన వెబ్‌సైట్‌ల గురించి కూడా చెప్పారు.లింక్డ్ఇన్, ఇండీడ్, హ్యాండ్‌షేక్, జాబ్రైట్(LinkedIn, Indeed, Handshake, JobBright).ఏఐ వంటి జాబ్ వెబ్‌సైట్లను ఆయన ఉపయోగించారు.ఇతరులకు ఈమెయిల్‌లు పంపడానికి హంటర్.
ఐఓ అనే వెబ్‌సైట్‌ను యూజ్ చేశాడు.తన రెజ్యూమే, కవర్ లెటర్లను సరిచేసుకోవడానికి చాట్‌జీపీటీ+ AI టూల్‌ను ఉపయోగించాడు.ధ్రువ్ కోర్‌హాప్టిక్స్, బోయింగర్ ఇంగెల్హైమ్, బఫెలో విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు చేశారు.2024 మేలో 3.4 GPAతో గ్రాడ్యుయేట్ అయ్యాడు.తన కృషి, సానుకూల ఆలోచనలతో, ధ్రువ్ జీవితం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.
ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో స్థిరపడి, టెస్లాలో తన కెరీర్‌ను ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.