ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు వాహనాల పిచ్చి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.మార్కెట్లోకి కొత్త కారు విడుదల అయింది అంటే చాలు చాలా మంది సెలబ్రిటీలు వాటిని ఇష్టపడి మరి కొనుగోలు చేస్తూ ఉంటారు.
అలాంటి వారిలో విజయ్ కూడా ఒకరు.కోలీవుడ్ హీరో దళపతి విజయ్(thalapathy vijay) కి కూడా కార్ల పిచ్చి ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఎన్నో రకాల కార్లు ఉన్నప్పటికీ కొత్త కొత్త కార్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు విజయ్.ఆ కార్ల విలువ కోట్లలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
విజయ్ దగ్గర దాదాపు 20 కి పైగా కార్లు ఉన్నాయి.వాటిలో 2 కోట్లకు పైగా విలువ చేసేవి 5 కి పైగా ఉన్నాయి.
2012 లో లండన్ నుండి రోల్స్ రాయిస్ గోస్ట్ కారుని ఇంపోర్ట్ చేసుకున్న విజయ్(vijay), దానికి సరిగ్గా టాక్స్ కట్టలేదనే ఆరోపణలు వచ్చాయి.ఈ కేసు కోర్టు వరకు వెళ్ళింది.
ఆ కారుని అమ్మేసిన తర్వాత లెక్సస్ LM 350h(lexus lm 350h) కొన్నారు.ఈ కారు మార్చిలోనే మార్కెట్లోకి వచ్చింది.
ముందే బుక్ చేసుకుని వెంటనే డెలివరీ తీసుకున్నారట.మరి ఈ కారులో అంత స్పెషల్ ఏముందో ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లగ్జరీ కార్లలో ఆడి, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్(BMW, Rolls Royce) లాంటి కార్లకు పోటీగా లెక్సస్ కొత్త కారు తయారు చేసింది.దీనికి, విమానానికి పెద్ద తేడా లేదు.
నాలుగు, ఏడు సీట్ల వేరియంట్లలో వచ్చిన ఈ కారులో విజయ్ నాలుగు సీట్ల వేరియంట్ కొన్నారు.కస్టమర్లకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి.

48 ఇంచ్ టీవీ, 23 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ఉన్నాయి.డ్రైవర్ సీట్ కి, వెనక సీట్లకి మధ్యలో పార్టిషన్ ఉండటంతో వెనక ఏం జరుగుతుందో డ్రైవర్ కి తెలియదు.మడత పెట్టుకునే టేబుల్స్, వైర్‌లెస్ ఛార్జర్, రీడింగ్ లైట్, అద్దాలు ఇలా అన్నీ ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి.ఇంకా, నీళ్ళు, కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది.
ఏసీ, హీటర్ కూడా ఉన్నాయి.ఈ కారులో ముఖ్యమైనది సీట్లు.
మెత్తగా ఉండే ఈ సీట్లలో పడుకుని ప్రయాణించవచ్చు.అడ్జస్ట్ చేసుకుంటే బెడ్ రూమ్ లా మారిపోతుంది.
మసాజ్ చేసే వైబ్రేటర్ కూడా ఉంది.అలాగే వెనక డోర్లు స్లైడింగ్ డోర్లు.
రిమోట్ కీ తోనే డోర్లు ఓపెన్ చేయవచ్చు.

పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ లో కూడా నడిచే ఈ కారులో 60 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.360 డిగ్రీల కెమెరా సిస్టమ్ కూడా ఉంది.బీఎండబ్ల్యూ(BMW), ఆడి లాంటి కార్లు ఉన్నా, విజయ్ ఇన్నోవా, మారుతి సుజుకి లాంటి కార్లలోనే బయట తిరుగుతుంటారు.
ఈ కొత్త లగ్జరీ కారు కొనడానికి ఆయన రాజకీయాలే కారణం అంటున్నారు.ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.చాలామంది ఆ కారు ఫీచర్లను తెలిసి నోరెళ్ళ బెడుతున్నారు.







