ప్రభాస్ మారుతి (Prabhas, Maruti)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న్ ది రాజాసాబ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.
మారుతి ఈ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉండగా ఈ సినిమా కథనం విషయంలో మారుతి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.
ది రాజాసాబ్( the rajasaab) సినిమాలో ప్రభాస్(prabhas) మూడు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో సంజయ్ దత్(Sanjay Dutt) కనిపించనున్నారని భోగట్టా.సంజయ్ దత్, ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ పాత్రల మధ్య వచ్చే సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.
వైట్ హెయిర్ లుక్ లో ప్రభాస్ (Prabhas)పాత్ర సూపర్ గా ఉంటుందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ దెయ్యం పాత్రలో కనిపిస్తారని తనను మోసం చేసిన సంజయ్ దత్ పై పగతో ఉంటాయని భోగట్టా.చంద్రముఖి, నాగవల్లి( Chandramukhi ,Nagavalli) సినిమాలను గుర్తు చేసే విధంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతోంది.ది రాజాసాబ్ సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు ఉండే అవకాశం అయితే దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.

ది రాజాసాబ్ సినిమా 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.ప్రభాస్ ది రాజాసాబ్ కలెక్షన్ల పరంగా అదరగొట్టడం పక్కా అని ఫ్యాన్ ఫీలవుతున్నారు.సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ కానుందని చెప్పవచ్చు.మారుతి గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.
ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ప్రభాస్ టాప్ లో ఉన్నారు.







