వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతి, సాంప్రదాయాలను అక్కడా వ్యాపింపజేస్తున్నారు.భారతీయ పండుగలు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ విదేశీయులకు సైతం అలవాటు చేస్తున్నారు.
తాజాగా దివ్వెల పండుగ దీపావళిని( Diwali ) భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు జరుపుకోనున్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) ఇప్పటికే వైట్‌హౌస్‌లో భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీ దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు.యునైటెడ్ స్టేట్స్‌లోని మిగిలిన ప్రాంతాల్లో దివాళీ ఎలా జరుగుతుందో చూస్తే :
న్యూయార్క్,( New York ) న్యూజెర్సీ,( New Jersey ) పెన్సిల్వేనియా, టెక్సాస్ రాష్ట్రాలు దీపావళిని అధికారికంగా సెలవు దినంగా గుర్తించిన సంగతి తెలిసిందే.గురువారం సాయంత్రం అమెరికాలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లు దివ్వెల కాంతిలో వెలుగొందనున్నాయి.నిత్యం బిజీగా ఉండే ప్రవాస భారతీయులు ఒక చోట చేరి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.దీపావళిని భారత్‌లో అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు.
వేడుకల తేదీ , సమయం, లక్ష్మీపూజలు టైమ్ జోన్ ప్రకారం మారుతూ ఉంటాయి.
ఇక అమెరికాలో ఏయే ప్రాంతాల్లో దీపావళి వేడుకలు జరగనున్నాయో పరిశీలిస్తే :
చిల్డ్రన్స్ మ్యూజియం ఆఫ్ మన్‌హట్టన్ , న్యూయార్క్
సౌత్ స్ట్రీట్ సీపోర్ట్ మ్యూజియం, మన్‌హట్టన్, న్యూయార్క్
53rd స్ట్రీట్ లైబ్రరీ, మిడ్‌టౌన్ వెస్ట్
భక్తి సెంటర్ , గ్రేమెర్సీ
కార్టెల్యూ లైబ్రరీ, 1305 కార్టెల్యూ రోడ్, ఈస్ట్ ఫ్లాట్‌బుష్
దివాళీ ఈవెంట్స్ ఎట్ ద డల్లాస్ పబ్లిక్ లైబ్రరీ, డల్లాస్
కార్య సిద్ధి హనుమాన్ టెంపుల్, ఫ్రిస్కో
కైడ్ వారెన్ పార్క్, డల్లాస్
లేక్‌వుడ్ పార్క్ , లెండర్ , టెక్సాస్
రౌండ్ రాక్ , టెక్సాస్