తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు పెద్దగా సినిమాలు సక్సెస్ అవ్వకపోయిన కూడా వాళ్ళ ఫ్యాన్ బేస్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కానీ ఏ సపోర్టు లేకుండా వచ్చిన వాళ్లకు మాత్రం సక్సెస్ లు లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.

అందువల్లే కొంతమంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు.కొంతమంది వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ముఖ్యంగా నిఖిల్,( Nikhil ) కిరణ్ అబ్బవరం,( Kiran Abbavaram ) సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) లాంటి హీరోలు వాళ్ళని వాళ్ళు భారీ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది మంచి విషయమనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సమయంలో ఎలాగైనా సరే వాళ్ళకంటూ ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు… కిరణ్ అబ్బవరం క సినిమాతో( Ka Movie ) సక్సెస్ అందుకున్నాడు.

ఇక నిఖిల్ కూడా తొందర్లోనే స్వయంభు( Swayambhu ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కడమే కాకుండా ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుందని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాలతో ఈ యంగ్ హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది… వీళ్లు కనక భారీ సక్సెస్ ని సాధించినట్టైతే వీళ్లకు కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవ్వడమే కాకుండా ఫ్యాన్ బేస్ కూడా భారీగా పెరుగుతుందనే చెప్పాలి…
.







