తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు( Actors ) చాలామంది ఉన్నారు.అయినప్పటికీ వాళ్ళందరిని కాదని కొంతమందికి మాత్రమే ఇక్కడ భారీ క్రేజ్ అయితే దక్కుతుంది.
నిజానికి దర్శకులు( Directors ) వాళ్ల కథను బట్టి దానికి అయ్యే బడ్జెట్ ను బట్టి ఆ రేంజ్ లో ఎవరికైతే మార్కెట్ ఉందో ఆ హీరోని సంప్రదిస్తూ ఉంటారు.దానివల్ల పెట్టిన బడ్జెట్ రికవరీ అవుతుందనే కాన్ఫిడెంట్ ని ప్రొడ్యూసర్స్ కి ఇవ్వడమే కాకుండా ఆ సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
ప్రేక్షకుడికి నచ్చే సినిమా తీయడానికి దర్శకుడు సిద్ధం గా ఉండాలి.అలా ఉన్నప్పుడే వాళ్లు చేసే సినిమాల మీద హీరోలకి నమ్మకం ఏర్పడుతుంది.
ఇక దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులకు కూడా ఆ సినిమా చూడాలి అనే ఒక కోరిక అయితే కలుగుతుంది.తద్వారా దర్శకుడు సినిమా కథని( Movie Story ) ఎలా డీల్ చేస్తున్నాడనే దాని మీదనే సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది.ప్రేక్షకుల్లో ఎంత ఎక్కువ సార్లు సినిమా చూడాలనే కుతూహలన్నీ కలిగిస్తామో అంత ఎక్కువ కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది.ముఖ్యంగా రాజమౌళి( Rajamouli ) సినిమాలను ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
దానివల్ల ఆయన సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి.ఇక మిగతా డైరెక్టర్ల విషయంలో ఇది అంతగా వర్కౌట్ కాదనే చెప్పాలి.ఇక పెట్టిన బడ్జెట్ రికవరీ చేయాలంటే సినిమాలో ఎలివేషన్స్ గాని, ఎమోషన్స్ గాని బాగా రక్తి కట్టించాలి.అలా ఉన్నప్పుడే ప్రేక్షకుడు ఒకటికి రెండుసార్లు ఆ సినిమాను చూడాలనే కుతూహలంతో థియేటర్ కి వచ్చి సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తాడు… అందుకే ఒక సినిమా సక్సెస్ లో డైరెక్టర్ ది కీలక పాత్ర అనే చెప్పాలి…
.