యాక్టర్ గా ఎదగాలంటే వందల సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు.ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్ చాలు అని నిరూపించాడు హర్ష.
వైవా అనే చిన్న కామెడీ షార్ట్ ఫిల్మ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు ఈ బొద్దు అబ్బాయి.తన శరీర రూపమే తనకు అనుకూలంగా మారింది.
అదే ఆయనను పరిశ్రమలో నటుడిగా నిలబెట్టింది.అయితే ఈ అబ్బాయికి ఓ అందమైన ప్రేమ కథ ఉంది.
హర్ష తనకు ప్రపోజ్ చేయడం కాదు.తనే హర్షను కావాలనుకుంది.
ఆమె తనకు మంచి స్నేహితులరాలు కూడా.కానీ వాళ్ల నాన్న నో చెప్పాడు.
ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు హర్ష దంపతులు.ఇంతకీ వీళ్ల లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయ్యింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
8 సంవత్సరాల క్రితం వైవా అనే షార్ట్ ఫిల్మ్ చేసి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష.ఈ షార్ట్ ఫిల్మ్ తోనే తాను వైవా హర్షాగా మారిపోయాడు.
ప్రస్తుతం సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పలు అవకాశాలతో ముందుకెళ్తున్నాడు.తాజాగా తన స్నేహితురాలు అక్షరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా వీరి పెళ్లి జరిగింది.
ఈ వివాహానికి చాలా మంది సినిమా నటులు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు.
ఎంకాం పూర్తి చేసింది అక్షర.ఈమె సొంతూరు వైజాగ్.గడిచిన నాలుగు సంవత్సరాలుగా హర్షాతో తనకు పరిచయం ఉంది.
ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు.అప్పుడప్పుడు కలిసేవారు.
కొద్ది రోజుల క్రితం హర్ష పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు.ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్పి.
మంచి అమ్మాయి ఉంటే చూడాలని చెప్పాడట.దీంతో అక్షర తనను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిందట.తను ఆ మాట చెప్పడంతో నో అనలేకపోయాడట హర్ష.అయితే అమ్మాయి తండ్రి మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదట.చాలా ప్రయత్నించినా తను ఓకే చెప్పలేదట.అయినా అక్షరను పెళ్లి చేసుకున్నాడు హర్ష.
కేవలం సన్నిహితులు, బంధుల మధ్యే ఈ పెళ్లి జరిగింది.అటు కలర్ ఫొటో, గల్లీ రౌడీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హర్ష.
పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు.సినిమాల్లోనూ బిజీ అయ్యాడు.