కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గతంలో ఏ సినిమాకు ప్రమోషన్స్ చేయని స్థాయిలో క సినిమాకు( Ka Movie ) ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఒకింత భారీ అంచనాలతో క మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది.
క సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేయగా ఈ సినిమాతో ఆ నమ్మకం నిజమైంది.కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొట్టడం పక్కా అని తేలిపోయింది.

క సినిమాలో ట్విస్టులు అదిరిపోయాయని క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి.హైదరాబాద్ లోని( Hyderabad ) మెజారిటీ థియేటర్లలో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఈ సినిమా రన్ అవుతోంది.సస్పెన్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదనే చెప్పాలి.

అమరన్, బఘీరా సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. క సినిమా రిజల్ట్ విషయంలో కిరణ్ అబ్బవరం సైతం తన సంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.క సినిమాకు థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి.క సినిమాకు బీజీఎం హైలెట్ అయింది.కిరణ్ అబ్బవరం నటన( Kiran Abbavaram Acting ) ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.
కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో మెప్పించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేయగా ఇద్దరు దర్శకులు అదరగొట్టారనే చెప్పాలి.క సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.క సినిమా అక్టోబర్ నెలలో రిలీజైన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.







