ఈ హోమ్ మేడ్ సీరంను వాడితే మేకప్ లేక‌పోయినా అందంగా మెరుస్తారు!

మేకప్ లేకపోయినా సహజంగానే అందంగా మెరుస్తూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.కానీ అటువంటి చర్మాన్ని పొందడం అసాధ్యంగా భావిస్తుంటారు.

 If You Use This Serum You Will Naturally Glow Beautifully , Glow Skin, Skin Care-TeluguStop.com

ఈ క్రమంలోనే మేకప్ తోనే అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం ( Homemade serum )ను వాడితే మేకప్ అక్కర్లేదు సహజంగానే అందంగా మెరిసిపోతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు( Fresh rose petals ), అర కప్పు బీట్ రూట్ ముక్కలు ( Beet root slices )వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel )నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ బీట్ రూట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్, ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Face Serum, Glow Skin, Latest, Serum, Skin Care, Skin Care Tips, Sk

తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆపై తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసుకోవాలి.ఈ సీరంను రెగ్యులర్ గా వాడితే స్కిన్ టోన్ సూప‌ర్ గా ఇంప్రూవ్ అవుతుంది.

Telugu Tips, Face Serum, Glow Skin, Latest, Serum, Skin Care, Skin Care Tips, Sk

చర్మంపై ముదురు రంగు మచ్చలు ఉంటే మాయం అవుతాయి.స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.ముడతలు చారలు వంటి వృద్ధాప్య లక్షణాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం టైట్ గా మారుతుంది.మరియు స్కిన్ గ్లోయింగ్ గా, షైనీ గా సైతం మెరుస్తుంది.కాబట్టి మేకప్ లేకపోయినా సహజంగానే అందంగా మెరుస్తూ కనిపించాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube