ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు చాలా హోరహోరిగా సాగాయి.ఈసారి గెలుపు కోసం ప్రధాన పార్టీలు భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది.
ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్( YS Jagan ) సిద్ధం, మేమంతా సిద్ధం ఇంకా రకరకాల పార్టీ కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉన్నారు.కాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ బస్సు యాత్ర విజయవాడకి( Vijayawada ) చేరుకున్న సమయంలో.సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగింది.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.సరిగ్గా జగన్ ఎడమ కన్ను బొమ్మపై రాయి బలంగా తాకింది.
ఒక్కసారిగా జగన్ తల్లడిల్లిపోయారు.జగన్ తో పాటు పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కి( Vellampalli Srinivas ) కూడా గాయం కావడం జరిగింది.ఈ ఘటనకి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా సతీష్( Satish ) అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా న్యాయస్థానం కండిషనర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది.ప్రతి శని, ఆదివారాలు సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.50 వేల షూరిటీ సమర్పించాలని ఆదేశించింది.కాగా సతీష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.