సినిమా పూర్తిగా నిర్మాణం జరుపుకున్నాక ఒకసారి దర్శకుడు లెంత్ ఎలా ఉంది, ప్రతి పాత్ర ఎలా పండింది అని చెక్ చేసుకుంటూ ఉంటాడు.అయితే మొదట్లో అంతా బాగానే అనిపించిన ఆ షూటింగ్ చేసిన తర్వాత కొన్ని పాత్రలు ఆ సినిమాకి అసలు అవసరం లేదు అని అనిపించవచ్చు లేదా మరికొన్ని సార్లు కొత్త కంటెంట్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది.
దర్శకుడు విజన్ ఎలా ఉంటే సినిమా అలా రావాలి అంటే కొన్నిసార్లు కొంతమంది నటులు ఇబ్బందులు పడక తప్పదు.అయితే సినిమా పూర్తిగా షూటింగ్ అయ్యాక పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చిందని కొంతమంది నటుల పాత్రను పూర్తిస్థాయిలో సినిమా నుంచి లేపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలా కరివేపాకు లాగా సినిమా నుంచి పక్కన పెట్టబడిన ఆ నాటి నటులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.బాహుబలి సినిమాలో( Baahubali ) బందిపోటు వీరయ్య అనే పాత్రలో ఒక రాజ్యానికి రాజుగా అజయ్ ఘోష్( Ajay Ghosh ) నటించారు.కానీ సినిమా పూర్తయ్యాక ఆ పాత్ర తో సినిమాకి కనెక్షన్ లేదనో లేదంటే అసలు లెంత్ పూర్తిగా దాటిపోయింది అనే అనుమానంతో రాజమౌళి అజయ్ పాత్రను పూర్తిగా కట్ చేశాడట.ఇక నిన్ను కోరి( Ninnu Kori ) అనే సినిమాలో జబర్దస్త్ నటుడు అయిన ఆటో రాంప్రసాద్ తో( Auto Ram Prasad ) ఒక పాత్ర చేయించారట ఆ చిత్ర దర్శకుడు.
కానీ ఈ సినిమా లెంత్ ఎక్కువ కావడంతో పూర్తిగా అతని పాత్రను సినిమా నుంచి తొలగించాల్సి వచ్చింది అంట.

ఈ విషయాన్ని ఆటో రాంప్రసాద్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తానే తెలియజేయడం విశేషం.ఆచార్య సినిమాలో( Acharya ) చిరంజీవి సరసన కాజల్( Kajal ) హీరోయిన్ గా నటించగా అసలు ఆ పాత్ర లేకపోయినా కూడా ఆ సినిమాకి వచ్చే నష్టం లేదు అనే ఒకే ఒక కారణంతో కొరటాల శివ కాజల్ పాత్రను పూర్తిగా సినిమా నుంచి తీసేశారట.పైగా అదే సమయానికి కాజల్ ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వచ్చాయి.
ఇలా ఈ నటీనటులందరినీ పూర్తిస్థాయి షూటింగ్ జరిగిన తర్వాత కూరలో కరివేపాకులాగా పక్కన పెట్టేశారు సదరు సినిమాల దర్శకులు.