సాధారణంగా కొందరి జుట్టు తరచూ డ్రై గా మారుతుంటుంది.ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో ఈ సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.
వాతావరణంలో వచ్చే మార్పులు, చుండ్రు, పోషకాల కొరత, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల జుట్టు పొడిబారిపోతుంటుంది.దీంతో ఈ సమస్య నుంచి బయటపడడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాను పాటిస్తే చాలా సులభంగా పొడిబారిన జుట్టును స్మూత్ అండ్ షైనీ గా మెరిపించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ ఇంటి చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ ను మిక్సీ జార్ లో వేసి జ్యూస్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జ్యూస్ వేసుకుని స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో నిప్పుకోవాలి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్ప్రే చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెడ్ బాత్ చేయాలి.
ఇలా కనుక చేస్తే పొడిబారిన జుట్టు స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తుంది.వారంలో రెండు సార్లు ఈ ఇంటి చిట్కాను పాటిస్తే జుట్టు మళ్ళీ మళ్ళీ పొడిబారకుండా ఉంటుంది.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
చుండ్రు సమస్య ఉంటే తగ్గు ముఖం పడుతుంది.మరియు చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి సైతం ఈ ఇంటి చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.