టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చోటు దక్కిందిగా!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే.చిరంజీవి(chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

 Megastar Chiranjeevi Gets Awarded Uae Gloden Visa Honoured Dubai Govt, Chiranjee-TeluguStop.com

కాగా మెగాస్టార్ చిరంజీవి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గొప్ప గొప్ప దానాలు చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు.ఇకపోతే ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో చిరంజీవి పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

అందులో భాగంగా తాజాగా మరోసారి చిరంజీవి(chiranjeevi ) పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Chiranjeevi, Dubai, Golden Visa, Kamal Haasan, Rajinikanth, Tollywood-Mov

పూర్తి వివరాల్లోకి వెళితే.మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.చిరుకు దుబాయ్‌( dubai ) ప్రభుత్వం ఆయనకు గోల్డెన్‌ వీసాను (Golden visa) అందించింది.

ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది.ఈ వీసాతో దుబాయ్‌లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండేందుకు అనమతి లభిస్తుంది.2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్‌ వీసాలు అందిస్తోంది.అయితే ఇప్పటికే ఈ వీసా అందుకున్న వారిలో తమిళ స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, కమల్ హాసన్‌(Rajinikanth, Kamal Haasan) లాంటి అగ్రహీరోలు కూడా ఉన్నారు.

Telugu Chiranjeevi, Dubai, Golden Visa, Kamal Haasan, Rajinikanth, Tollywood-Mov

తాజాగా మెగాస్టార్‌ సైతం వారి సరసన చేరనున్నారు.అయితే మెగాస్టార్‌ కంటే ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్‌ వీసాను అందుకున్నారు.చిరుకంటే ముందుగా రామ్ చరణ్‌ భార్య, ఆయన కోడలు ఉపాసన(upasana), ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun)గోల్డెన్‌ వీసాను అందుకున్నారు.తాజాగా ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.

బింబిసార్ డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube