జగన్ మద్దతు కోసం  అప్పుడే కాంగ్రెస్ తంటాలు ? 

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా లేదా మళ్లీ వైసీపీ( YCP ) రెండోసారి అధికారంలోకి వస్తుందా అనే విషయంలో అందరిలోనూ సందిగ్ధం నెలకొంది.రకరకాల విశ్లేషణలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

 Will Congress Seek Jagan's Support, Jagan, Ap Cm Jagan, Ap Government, Ysrcp,-TeluguStop.com

కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, లేదు మళ్ళీ వైసీపీకే ఛాన్స్ ఉందని ఇంకొంతమంది తమదైన శైలిలో విశ్లేషణలను బయటకు విడుదల చేస్తున్నారు ఇక అనధికారికంగా అనేక సర్వేలు బయటకు వచ్చాయి.ఇది ఇలా ఉంటే జగన్ మాత్రం గెలుపు ధీమాతో ఉన్నారు.

ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తామని, విశాఖలోని ప్రమాణ స్వీకారం చేస్తామని ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నారు.టిడిపి, జనసేన, బిజెపి లు అంతే స్థాయిలో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.ఎంపీ స్థానాలు విషయానికొస్తే .2019లో కంటే ఎక్కువ స్థానాలను గెలుస్తామని జగన్ చెబుతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Congressindia, Jagan, Nda Aliance, Telugudesam, Ys Jagan

2019లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు.ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థానాల్లో వైసిపి ఎంపీ అభ్యర్థులు గెలుస్తారని జగన్( YS Jagan Mohan Reddy ) ధీమాగా చెబుతున్నారు.జగన్ మద్దతు కోసం ఢిల్లీ స్థాయిలో రాయబారాలు మొదలయ్యారట.ఇప్పటి వరకు కేంద్రములో బిజెపి ప్రభుత్వానికి పరోక్షంగా జగన్ మద్దతు ఇచ్చారు.కేంద్ర ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లుల సమయంలో, వైసీపీ ఎంపీల మద్దతు ఉండేలా చేశారు.అనేక రకాలుగా కేంద్రానికి సాయం పడుతూ వచ్చారు.

అంతే స్థాయిలో జగన్ విషయంలోనూ బిజెపి పెద్దలు సానుకూల వైఖరిని అవలంబిస్తూ వచ్చారు.అయితే ఇప్పుడు సీన్ మారింది.

టిడిపి, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడడంతో, బిజెపి ప్రజలకు మధ్య దూరం పెరిగింది.

Telugu Ap Cm Jagan, Ap, Congressindia, Jagan, Nda Aliance, Telugudesam, Ys Jagan

బిజెపి కూటమిలో ఉండడంతో ఖచ్చితంగా జగన్ బిజెపికి దూరంగానే ఉంటారు.ఎన్నికల ఫలితాలలో ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే, కచ్చితంగా జగన్ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కీలకం అవుతారు.ఈసారి ఎన్డీఏ కూటమికి గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ వస్తాయనే విశ్లేషణలు బయటకు వచ్చాయి.

లోక్ సభ సీట్ల కంటే బిజెపికి రాజ్యసభలో ఇతర పార్టీలకు మద్దతు అవసరం.ఇప్పటి వరకు రాజ్యసభలో వైసిపి సహకారం అందింది.అయితే ఇప్పుడు టిడిపితో బిజెపి కలవడంతో, ఇక నుంచి వైసిపి సహకారం అందుతుందా లేదా అనేది సందేహంగానే ఉంది గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ – ఇండియా కూటమి నేతలు ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు.తాజాగా వైసిపి కీలక నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బిజెపి ఏపీలో టీడీపీతో కలవడంతో, తమతో కలిసి రావాలని ఇండియా కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నారట.అయితే జగన్ మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చినా తమ మద్దతు కావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా పై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారట.

వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమిలో టిడిపి ఉండడంతో బిజెపికి మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదు.దీంతో కాంగ్రెస్ – ఇండియా కూటమి నేతలు జగన్ మద్దతు పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube