ఎముకల బలహీనత, రక్తహీనత ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.రక్తహీనత వల్ల తరచూ నీరసం, అలసట వేధిస్తుంటాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పాలిపోవడం వంటి ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతాయి.అలాగే ఎముకల బలహీనత వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.
మెట్లు ఎక్కాలన్న, ఎక్కువసేపు నిలబడాలన్న చాలా ఇబ్బంది పడుతుంటారు.
![Telugu Anemia, Bone Weakness, Tips, Latest, Sesame Seeds, Sesameseeds-Telugu Hea Telugu Anemia, Bone Weakness, Tips, Latest, Sesame Seeds, Sesameseeds-Telugu Hea](https://telugustop.com/wp-content/uploads/2024/05/anemia-sesame-seeds-drink-sesame-seeds-sesame-seeds-health-benefits-latest-news-health-health-tips.jpg)
అయితే ఎముకల బలహీనత, రక్తహీనత( Bone weakness, anemia ) ఈ రెండిటికి చెక్ పెట్టే టాప్ అండ్ బెస్ట్ డ్రింక్ ఒకటి ఉంది.ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి వాటర్ తో రెండు సార్లు వాష్ చేసుకోవాలి.ఆపై ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న నువ్వుల( Sesame Oil )ను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు నల్ల బెల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
![Telugu Anemia, Bone Weakness, Tips, Latest, Sesame Seeds, Sesameseeds-Telugu Hea Telugu Anemia, Bone Weakness, Tips, Latest, Sesame Seeds, Sesameseeds-Telugu Hea](https://telugustop.com/wp-content/uploads/2024/05/sesame-seeds-drink-sesame-seeds-sesame-seeds-health-benefits-latest-news-health-health-tips-good-health.jpg)
ఆపై అందులో ఒక కప్పు కాచి చల్లార్చిన ఆవు పాలు కలిపి సేవించాలి.ఈ డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా మంచిది.ఈ డ్రింక్ లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ ఈ తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి.
నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే రక్తహీనత చాలా వేగంగా తగ్గుతుంది.అలాగే బలహీనంగా ఉన్న ఎముకలు గట్టిగా దృఢంగా మారతాయి.ఈ డ్రింక్ ఆరోగ్యకరమైన ఎముకలకు మద్దతు ఇస్తుంది.అంతేకాకుండా గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్లు, ఊబకాయం మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ డ్రింక్ అద్భుతంగా తోడ్పడుతుంది.