పోటా పోటీ :  బీఆర్ఎస్ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తోంది.దేశవ్యాప్తంగా ప్రముఖులు కొంతమందిని తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు ప్లాన్ చేసుకుంది.

 Brs Ready To Telangana Formation Day Details, , Brs, Bjp, Telangana Governmen-TeluguStop.com

  కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ సైతం ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇప్పటికే స్వయంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ క్రెడిట్ కాంగ్రెస్ కు వెళ్లకుండా బీఆర్ఎస్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతోంది.ఈ మేరకు బీఆర్ఎస్ తరపున సొంతంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటుంది .ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.

Telugu Pcc, Revanth Reddy, Sonia Gandi, Telangana-Politics

గత ఏడాది జూన్ రెండో తేదీన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా నిర్వహించారు.అయితే దీనికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు.మళ్లీ అధికారంలోకి వచ్చాక ముగింపు ఉత్సవాలు ఉంటాయని ప్రకటించారు.

కానీ బీ ఆర్ ఎస్ అధికారంలోకి రాకపోవడంతో,  సొంతంగానే పార్టీ తరఫున ముగింపు సంబరాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ముగింపు వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు .

Telugu Pcc, Revanth Reddy, Sonia Gandi, Telangana-Politics

జూన్ 1 నుంచి క్యాండిల్ ర్యాలీ,  జూన్ రెండవ తేదీన కేసిఆర్( KCR ) అధ్యక్షతన తెలంగాణ భవన్ లో సమావేశం, ప్రభుత్వ ఆసుపత్రులు , అనాధ శరణాలయాల్లో పళ్ళు,  స్వీట్ల పంపిణీ , మూడో తేదీన పార్టీ కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులకు కేసిఆర్ పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధీటుగా పార్టీ తరఫున ఈ వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.ఇప్పటికే దీనికి సంబందించిన ఏర్పాట్లు మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube