కుక్కల కోసమే ప్రత్యేకమైన విమానం సంస్థ లాంచ్.. దాని విశేషాలు ఇవే..?

పెంపుడు కుక్కలతో( Pet Dogs ) మన ప్రయాణం చేయాలంటే పెద్ద సమస్య.దానికి కారణం ప్రయాణం చేసిన సమయంలో అవి ఎక్కడ భయపడుతాయోన్న ఆందోళన వారి యాజమాన్యులకు ఉంటుంది.

 Bark Air A New Airline For Dogs Launches Its First Flight Details, Bark Airlines-TeluguStop.com

దాంతోపాటు విమానా సంస్థ నుండి అనేక రకాల ఆంక్షలు కూడా ఉంటాయి.ఇక ఈ సమస్యలన్నిటికీ చెక్ చెప్పేందుకు బార్క్ ఎయిర్( Bark Air ) అనే సంస్థ సిద్ధమైంది.

ఇందుకోసం ప్రత్యేకంగా పెంపుడు కుక్కల కోసమే విమాన సేవలను మొదలుపెట్టింది.ఈ నేపథ్యంలోనే తాజాగా బార్క్ ఎయిర్ తన తొలి విమానం న్యూయార్క్ నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు చేర్చించింది.

ఈ సర్వీస్ సంబంధించి అన్ని టికెట్లు అమ్ముడుపోయినట్లు సంస్థ వెల్లడించింది.

బార్క్ అనే కంపెనీ శునకాల ఆహారం అలాగే వాటికి సంబంధించిన ఆట బొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంటుంది.ఇకపోతే తాజాగా ఈ సంస్థ ఓ జెట్ చార్టెడ్ సర్వీస్( Jet Chartered Service ) కంపెనీతో జతకట్టి బార్క్ ఎయిర్ ను మొదలుపెట్టింది.ఈ సేవలను గత నెలలోనే ప్రకటించింది.

ఇలా కేవలం జంతువుల కోసమే ఏర్పడిన రెండో విమాన సంస్థ ఇది.ఇదివరకు ఇంగ్లాండ్ కు చెందిన కే 9 జెట్స్( K9 Jets ) అనే ఓ ప్రైవేట్ సంస్థ ఈ సేవలను మొదటిసారిగా మొదలుపెట్టింది.ఇకపోతే తాజాగా బార్క్ ఎయిర్ సంస్థ సునకాల కోసం అనుకూలంగా విమానంలో అన్ని వసతులను ఏర్పాటు చేసింది.

ఈ విమానంలో శునకాలతో పాటి మనుషులు కూడా ప్రయాణం చేయవచ్చు.కాకపోతే ఏర్పాట్ల విషయంలో మాత్రం మొదటి ప్రాధాన్యత శునకాలకు మాత్రమే.విమానంలో ప్రయాణించాలంటే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి.ఆ తర్వాత గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి.ఆ తర్వాత చెకింగ్ ప్రాసెస్ అలాగే క్యూలైన్లు, బోర్డింగ్ వంటి హడావిడి లేకుండా విమాన సిబ్బంది అక్కడి నుంచి వారికి సేవలను మొదలుపెడతారు.

ఈ ప్రయాణంలో సునకాలకు ఇరుకుగా ఉండొద్దని ఉద్దేశంతో విమాన సామర్థ్యం మొత్తానికి ఎప్పుడు టికెట్ బుకింగ్ తీసుకోబోమని బార్క్‌ ఎయిర్‌ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube