బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru Rave Party ) విషయం సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఓ ప్రముఖ వ్యాపారవేత్త పుట్టినరోజు సందర్భంగా బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పార్టీ నిర్వహించారు.
అయితే ఇందులో భాగంగా డ్రగ్స్( Drugs ) భారీ స్థాయిలో వినియోగించారనే విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు ఇందులో భాగంగా పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ పార్టీలో భాగంగా సినీనటి హేమ( Hema ) కూడా ఉన్నారంటూ పోలీసులు వెల్లడించారు.
ఇలా హేమ ఈపార్టీలో పేరు మార్చుకొని పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.
ఇక ఈమె ఈ వార్తలను ఖండించినటువంటి నేపథ్యంలో ఆమెకు పరీక్షలు కూడా నిర్వహించడంతో అందులో పాజిటివ్ గా తేలిన విషయాన్ని పోలీసులు వెల్లడించారు.అయితే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు ( Notice ) పంపించారు.ఇక నేడు జరిగినటువంటి ఈ విచారణకు హేమ హాజరు కాలేదు.
ఇలా తను హాజరు కాకపోవడానికి కారణాన్ని తెలియజేస్తూ ఈమె పోలీసులకు లేఖ రాశారు.
ఈ లేఖలో భాగంగా తాను హై ఫీవర్( High Fever ) తో బాధపడుతున్నానని అందుకే తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఈమె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్( CCB ) పోలీసులకు లేఖ రాసింది.ఈ విధంగా పోలీసులకు లేఖ రాయడంతో ఈ లేకపై సీసీబీ స్పందిస్తూ.తాము ఈ లేఖను పరిగణలోకి తీసుకోలేమని తెలిపింది.
హేమకు మరోసారి నోటీసులు పంపనున్నట్లు ప్రకటించింది.ఇక ఈ పార్టీలో భాగంగా పాల్గొన్నటువంటి సెలబ్రిటీ లందరికీ కూడా పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు.
ఇక హేమ మాత్రం ఈ రేవ్ పార్టీలో తన పేరును పోలీసులు ప్రకటించినప్పటి నుంచి స్థానం హైదరాబాద్ లోనే ఉన్నానని వీడియోలు చేయడమే కాకుండా ఒకరోజు బిర్యాని చేస్తున్నానని మరోక రోజు ఆవకాయ పెడుతున్నానని వీడియోలు విడుదల చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం విచారణకు రావాలని నోటీసులు పంపారు.