నేడు ఫాదర్స్ డే( Father’s Day ).దీంతో చాలామంది తమ తండ్రులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారాతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేయడం జరిగింది.ఇంకా చాలామంది సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు.
ఈ రకంగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డిని( YS Rajasekhar Reddy ) తలంచుకుని సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.
“నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు.నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు చేసావు.మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావు.
నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నాను.ప్రజలకోసం పాటుపడే నీ ఓర్పును, నిబద్ధతను వారసత్వంగా చేసుకుని ముందుకు సాగుతున్నాను.
నువ్వెక్కడున్నా నీ ఆశీర్వాదం, అనురాగం, మార్గదర్శనం నాతో ఉన్నాయని తలుస్తాను”.అని పోస్ట్ పెట్టడం జరిగింది.
వైయస్ షర్మిల పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప పార్లమెంటు స్థానం నుండి వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దిగడం జరిగింది.
ఈ క్రమంలో లక్షకు పైగా ఓట్లు సాధించి ఓటమి పాలు కావటం జరిగింది.