కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో వయనాడ్, రాయబరేలి లోక్ సభ స్థానాలలో గెలవడం జరిగింది.
దీంతో రెండు నియోజకవర్గాలలో ఒక సీటును వదులుకోవాల్సి రావటంతో.వయనాడ్( Wayanad ) వదులుకున్నారు.
రాయబరేలి ఎంపీగా కొనసాగుతున్నారు.ఈ నిర్ణయంతో వయోనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ క్రమంలో తన సహోదరి ప్రియాంక గాంధీని.( Priyanka Gandhi ) వయనాడ్ నియోజకవర్గం నుండి పోటీకి దింపడానికి సిద్ధమయ్యారు.
ప్రియాంక గాంధీ 2004, 2007 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అమేథీ, రాయబరేలి పార్లమెంటు స్థానాలలో ప్రచారం చేయటం జరిగింది.ఆ రకంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు పాటు రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ 2019 సార్వత్రిక ఎన్నికలలో.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తరపున ప్రచారంలో కీలకంగా రాణించారు.అప్పటినుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమితులై యూపీ ఎన్నికల ఇన్చార్జిగా పనిచేశారు.
అప్పటినుంచి దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు.కానీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు.అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంపీగా వయనాడ్ నియోజకవర్గం నుండి తప్పుకోవటంతో అక్కడ ఉప ఎన్నికలు రావడంతో.ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు.