ప్రభాస్ కి కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి.. ఎవరో తెలిస్తే...??

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) సినిమా ఇండస్ట్రీలో చాలామందిని డార్లింగ్ అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటాడు.వారికి భోజనాలు పెడుతూ ప్రేమను కురిపిస్తాడు.

 This Guy Make Prabhas Angry Details, Prabhas, Kk Senthil Kumar, Prabhas Angry, C-TeluguStop.com

ఒక్కసారి ప్రభాస్‌తో పరిచయం ఏర్పడిందంటే చాలు ఆయన పర్సనాలిటీకి ఫిదా ఇవ్వాల్సిందే.అందరినీ చాలా బాగా చూసుకుంటాడనే పేరు ప్రభాస్‌కి ఉంది.

అయితే సినిమాకు చెందిన వారిలో ఒకరంటే మాత్రం ప్రభాస్‌కు చాలా కోపం అట.ఆయన ఎవరో కాదు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్.( KK Senthil Kumar ) దర్శక దిగ్గజం రాజమౌళి తన అన్ని సినిమాలకు సెంథిల్ నే సినిమాటోగ్రాఫర్‌గా తీసుకుంటారు.

ఈ సినిమాటోగ్రాఫర్‌ ప్రభాస్ హీరోగా చేసిన ఛత్రపతి (2005),( Chatrapati ) బాహుబలి: ది బిగినింగ్ (2015),( Bahubali: The Beginning ) బాహుబలి 2 ది కన్‌క్లూజన్ (2017)( Bahubali 2 The Conclusion ) వంటి ప్రముఖ చిత్రాలకు కూడా పనిచేశాడు.అయితే ఈ సినిమాల షూటింగ్ సమయంలో సెంథిల్ తీరు ప్రభాస్ కి అసలు నచ్చకపోయేదట.ఎందుకంటే రాజమౌళి( Rajamouli ) కంటే సెంథిల్ ఎక్కువ పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించే వాడట.

Telugu Bahubali, Prabhas, Prabhas Angry, Rajamouli, Senthilkumar-Movie

ఫ్రేమ్‌లో పొజిషన్, మూవ్‌మెంట్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్ గా ఉండాలని యాక్టర్స్ కి సెంథిల్ సజెషన్స్ ఇస్తుంటారు.అయితే ప్రభాస్ సరిగా కెమెరా ముందు లేనప్పుడు చాలానే సజెషన్స్ ఇచ్చేవారట.షాట్ ఓకే అయ్యేంత వరకు ఇబ్బంది పెట్టే వారట.దీనివల్ల ప్రభాస్ ఇంకా ఎంత సేపయ్యా బాబు అంటూ చాలా కోపం తెచ్చుకునే వాడట.కానీ సెంథిల్ పర్ఫెక్ట్ గా సీన్ వచ్చేంతవరకు అంత ఈజీగా వదిలిపెట్టేవాడు కాదట.అలా రాజమౌళి కంటే ఎక్కువ పర్ఫెక్షనిజం తో ప్రభాస్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించేవాడు సెంథిల్.

Telugu Bahubali, Prabhas, Prabhas Angry, Rajamouli, Senthilkumar-Movie

ఇకపోతే ఈ సినిమాటోగ్రాఫర్‌ సిట్‌కామ్ టీవీ సిరీస్ అమృతంతో సినిమాటోగ్రాఫర్‌గా అరంగేట్రం చేశాడు.ఐతే (2003)తో మూవీలకు పనిచేయడం మొదలుపెట్టాడు.ఆ మూవీతో బాగా గుర్తింపు వచ్చింది.చివరగా ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాకు పని చేశాడు.ఈ మూవీ గ్లోబల్ లెవెల్లో సూపర్ హిట్ అయింది.ఇకపోతే ప్రభాస్ కల్కి 2898 క్రీ.

శ, కన్నప్ప, రాజా సాబ్, సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.ఈ మూవీలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube