ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) పరిస్థితి చాలా దారుణంగా ఉంది.మొన్నటిదాకా ఆగస్టు 15 కి థియేటర్ లోకి వస్తున్నాం అని చెప్పిన మేకర్స్ ఇప్పుడు పుష్ప 2 సినిమా( Pushpa 2 ) రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తునట్టుగా తెలుస్తుంది.
ఇక అందువల్లే ఆ డేట్ ని రామ్ కబ్జా చేశాడు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 ను అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే మొన్నటి దాకా అట్లీతో సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయినప్పటికీ అట్లీ తో( Atlee ) మాత్రం ఇప్పుడు సినిమా ఉండడం లేదు అనే విషయం కూడా తెలుస్తుంది.ఎందుకంటే అట్లీ ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగినందువల్లే ఈ సినిమాని క్యాన్సల్ చేసినట్టుగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నాడు.ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు.
ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాను లైవ్ లో పెడుతున్నారు.
మరి అల్లు అర్జున్ మాత్రం ఇంత లేటుగా ఎందుకు తన ప్రాసెస్ ని మొదలు పెడుతున్నాడో తెలియడం లేదు అంటూ వార్తలైతే వచ్చాయి.ఇక త్రివిక్రమ్ తో( Trivikram ) సినిమా ఉంటుంది అని కూడా వార్తలు వచ్చినప్పటికి అవి కార్యరూపం అయితే దాల్చలేదు.మరి ఇప్పుడు అట్లీ కూడా హ్యాండ్ ఇచ్చాడు.
కాబట్టి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడో అనే దానిమీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే