ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్ద సినిమాల హవా మొదలవుతుంది.జూన్ 27వ తేదీన కల్కి సినిమాతో( Kalki Movie ) ప్రభాస్ చాలా పెద్ద ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు.
ఇక ఆయన తర్వాత ఆగస్టు15 వ తేదీన డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాతో రామ్ మరోసారి తన లక్కును పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.ఇక సెప్టెంబర్ 27వ తేదీన దేవర సినిమాతో( Devara ) ఎన్టీఆర్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడు.
ఇక ఈ మూడు సినిమాలు మూడు నెలల్లో సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక గడిచిన ఆరు నెలల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సరైన పెద్ద సినిమా ఒకటి కూడా రాలేదు.కాబట్టి మిగిలిన ఆరు నెలల్లో ఇండస్ట్రీ మీద హీరోలు దండయాత్ర చేసి బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.రాబోయే మూడు నెలల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించి పాన్ ఇండియాలో( Pan India ) మరోసారి తెలుగు సినిమా సత్తాని చూపించడానికి రెడీ అవుతున్నాయి.ఇక ఆ తర్వాత గేమ్ చేంజర్( Game Changer ) ఓజీ( OG ) లాంటి సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…

ఇక ఈ ఆరు నెలలు మొత్తం ఇండియా వైడ్ గా తెలుగు సినిమాల హవా నే కనిపించబోతుంది అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక బాహుబలి దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీ హవా అనేది తగ్గింది.అప్పటినుంచి ఇప్పటివరకు కూడా బాలీవుడ్ వాళ్ళు సరైన సినిమాలు చేయలేకపోతున్నారు.ఇక ఈ క్రమంలోనే సౌత్ సినిమా ఇండస్ట్రీ బాగా పెరిగిపోయింది.అందులో తెలుగు సినిమాల హవా అయితే ఇండియా వైడ్ గా భారీ ఎత్తున ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
చూడాలి మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో మనవాళ్లు ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తారు అనేది…
.