హ్యాపీ డేస్( Happy Days ) సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు వరుణ్ సందేశ్( Varun Sandesh ) .ఈ సినిమాలో కాలేజీ కుర్రాడిగా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం కొత్త బంగారులోకం అనే సినిమా ద్వారా మరోసారి కాలేజీ కుర్రాడి పాత్రలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా వరుస హిట్ సినిమాలలో నటించడంతో ఈయనకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి.అయితే ఆ తర్వాత వరుణ్ నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

ఈ విధంగా ఈయన నటించిన సినిమాలో సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే ప్రస్తుతం వరుణ్ తిరిగి ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే త్వరలోనే వరుణ్ నటించిన నింద( Nindha Movie ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమా జూన్ 21వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటి వితికా( Vithika ) తన భర్త వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇటీవల కాలంలో తన భర్త వరుణ్ ను అందరూ ఫెయిల్యూర్ హీరో అంటున్నారు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా 17 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కష్టపడుతూ ఉన్నారు.
హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలను అందుకుంటు ఉన్నారు.ఫెయిల్యూర్ అంటే ఒక ఫ్లాప్ రాగానే ఇండస్ట్రీ నుంచి అన్ని సర్దుకొని వెళ్లిపోవడం కానీ నా భర్త అలా వెళ్ళిపోలేదు మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
ఇలా వితికా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలాంటి భార్య ఉంటే ఏ భర్త లైఫ్ లో ఫెయిల్యూర్ కారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







