బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ .. అసలు టార్గెట్ బీఆర్ఎస్ ? 

తెలంగాణలో బిజెపిని( BJP ) బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అగ్ర నేతలు పూర్తిగా దృష్టి సారించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఆశించిన ఫలితాలు రాకపోయినా, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిజెపికి సీట్లు ఆశించిన స్థాయిలో రావడం ఆ పార్టీ నేతల్లో సంతృప్తిని కలిగిస్తున్నాయి.

 Is Bjp's Operation Akarsh The Original Target Of Brs, Bjp, Brs, Telangana Govern-TeluguStop.com

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండడంతో , ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలను దక్కించుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.  అర్బన్ ప్రాంతాల్లోనే బిజెపికి ఆదరణ ఉందనే అభిప్రాయాలు అందరిలోనూ ఉండడంతో,  తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని బలోపేతం చేసి,  వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభావం కనిపించే విధంగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ? పార్టీ ఎక్కడ బలంగా ఉంది ?ఎక్కడ బలహీనంగా ఉంది అనే అంశాల పైన ఆరా తీస్తున్నారు.

Telugu Congress, Bjpsakarsh, Telangana-Politics

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) బలహీనం అవ్వడం తో , ఆ పార్టీలోని చాలామంది నాయకులు పార్టీ మారే ఆలోచనతో ఉన్నారు.కాంగ్రెస్ లో చేరేందుకు అవకాశం లేని వారంతా బిజెపి వైపు చూస్తూ ఉండడంతో,  క్షేత్రస్థాయి లో బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వలసలను ప్రోత్సహించే విధంగా బిజెపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.బీఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలే టార్గెట్ గా బిజెపిలోకి వలసలను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Telugu Congress, Bjpsakarsh, Telangana-Politics

ఇప్పటికే బీ ఆర్ ఎస్ నుంచి బిజెపి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నాయకుల జాబితాను తయారు చేశారట.నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలను  బిజెపిలో చేర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.తెలంగాణలో బీ ఆర్ ఎస్ ను బాగా బలహీనం చేసి,  రాబోయే రోజుల్లో బిజెపికి తిరుగు లేకుండా చేసుకునేందుకు బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కమలనాధులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube