దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోయే సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది.ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబును( Mahesh Babu ) హీరోగా పెట్టి సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ఆసక్తికరమైన చర్చలైతే జరుగుతున్నాయి.అయితే ఈ సినిమాలో అడ్వెంచర్ కి సంబంధించిన పాత్రను పోషించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఇంతకుముందే రాజమౌళి ఈ సినిమా హాలీవుడ్ ( Hollywood )లో వచ్చిన ఇండియానా జోన్స్ ఎలాగైతే అడ్వెంచర్ కి సంబంధించిన సినిమానో ఇది కూడా అలాంటి అడ్వెంచర్ జానర్ లోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించబోతున్నాం అంటూ ఈ సినిమా విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాని చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రాజమౌళి తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో వరల్డ్ లో ఉన్న డైరెక్టర్లలో తను కూడా టాప్ డైరక్టర్ గా ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా తనే దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ ఆర్టిస్ట్ లను ఫైనలైజ్ చేస్తున్న రాజమౌళి ఈ సినిమాని అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈలోపు బ్యాలెన్స్ వర్క్స్ అన్ని పూర్తి చేసి సినిమాని ఒకసారిగా సెట్స్ మీదకి తీసుకెళ్తే ఆపకుండా కంటిన్యూస్ గా షెడ్యూల్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది… మరి రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే రాజమౌళి ఒక భారీ సక్సెస్ ని సాధించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది…
.