అందుకే ' పల్లా ' కు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు 

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక టిడిపి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును( Palla Srinivasa Rao ) టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు( Chandrababu ) నియమించారు.  ఇప్పటి వరకు ఏపీ టిడిపి అధ్యక్షుడిగా కొనసాగిన కింజారపు అచ్చెన్న నాయుడు కి( Kinjarapu Atchennaidu ) మంత్రి పదవి దక్కడంతో , ఆయన స్థానంలో పల్లా కు అవకాశం కల్పించారు.

 Palla Srinivasa Rao Appointed As State Tdp President By Cm Chandrababu Naidu Det-TeluguStop.com

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు.వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పై 95,235 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డును సృష్టించారు.2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పల్లా గెలిచారు. 

Telugu Ap, Ap Tdp, Cm Chandrababu, Gajuwaka Mla, Jagan, Mlapalla, Pallasrinivasa

2024 ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే పల్లాకే టిడిపి అధ్యక్ష పదవి( TDP President Seat ) దక్కడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.పార్టీలో నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉండడం,  గతంలో విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉండడం,  బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం,  విద్యావంతుడు , పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ,  నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన పార్టీ అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయనకే ఈ పదవి దక్కింది.1984 నుంచి టీడీపీలోనే( TDP ) పల్లా శ్రీనివాసరావు ఉన్నారు.

Telugu Ap, Ap Tdp, Cm Chandrababu, Gajuwaka Mla, Jagan, Mlapalla, Pallasrinivasa

1994 –  99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.  కార్మిక నాయకుడిగా , టిడిపి అనుబంధ విభాగం , తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పాటులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత పల్లా శ్రీనివాసరావు,  ఆయన కుటుంబ సభ్యులను ఐదేళ్లపాటు వేధింపులకు గురి చేశారు.పార్టీలో చేరాల్సిందిగా అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చినా, అన్ని వత్తిళ్లు భరిస్తూనే వస్తూ పల్లా శ్రీనివాసరావు పార్టీ మారలేదు .ఇవన్నీ ఆయన కు కలిసి వచ్చి టిడిపి అధ్యక్ష బాధ్యతలు దక్కేలా చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube