పోలవరం చుట్టూ పర్యాటక అభివృద్ధి మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన..!!

నేడు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పోలవరం పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా మంత్రులు నాయకులు.

 Tourism Development Minister Durgesh Key Announcement Around Polavaram Details,-TeluguStop.com

ఘన స్వాగతం పలికారు.ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రి జనసేన నేత నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్( Minister Kandula Durgesh ) ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.డిప్యూటీ సీఎంగా పవన్, పర్యాటక మంత్రిగా తాను, ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును త్వరితగితిన పూర్తిచేసి పర్యాటకంగా అభివృద్ధి చేసి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.2019లో తెలుగుదేశం పార్టీ( TDP ) గెలిచి ఉంటే 2020 చివరినాటికి పోలవరం పూర్తయ్యేదని వెల్లడించారు.కానీ ఇప్పటి పరిస్థితులలో మరో నాలుగేళ్లు పడుతుందని వివరణ ఇచ్చారు.గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు.వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 30 సార్లు పోలవరం సందర్శించడం జరిగిందని తెలిపారు.

నేడు 31 వ సారి రావటం జరిగిందని నా మనసంతా ఈ ప్రాజెక్టు మీదనే ఉంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube