తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్లలో సునీల్( Sunil ) పేరు ముందు వరుసలో నిలుస్తుందనడంలో సందేహం లేదు.బంతి, కర్రి శీను, నల్లబాలుడు, బంకు శీను, పంచ్ ఫలక్నామా, గాలి శీను, బుల్లబ్బాయి, ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ చేసిన ప్రతి కామెడీ పాత్ర కూడా తెలుగు ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది.
మర్యాద రామన్న, పూలరంగడు వంటి ఫుల్ లెన్త్ కామెడీ చిత్రాలతో హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు సునీల్.ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు కానీ అవి వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
దీనివల్ల అతడి కెరీర్ చాలా ప్రమాదంలో పడిపోయింది.

హీరోగా సినిమాలు చేస్తే కెరీర్ ముగిసిపోవడం ఖాయం అనుకున్న సునీల్ చివరికి ప్రతి నాయకుడిగా తన లక్కు ట్రై చేసుకోవడం మొదలుపెట్టాడు.అదృష్టం కొద్దీ విలన్ గా క్లిక్ అయ్యాడు.సునీల్ పుష్ప సినిమా( Pushpa movie ) తర్వాత 2022లో ఏకంగా 17 సినిమాల్లో నటించాడు.2023లో 12 సినిమాలు చేశాడు.ఈ సంవత్సరం అతడు నటించిన 7 సినిమాలు ఆల్రెడీ విడుదలయ్యాయి.
ఈ నటుడు ఇప్పుడు పుష్ప-2, గేమ్ చేంజెర్ సినిమాల్లో నటిస్తున్నాడు.వీటితో సునీల్ రేంజ్ మరో స్టేజ్ కు చేరుకునే అవకాశం ఉంది.

తెలుగులో కలర్ ఫోటో, పుష్ప తర్వాత మంచి విలన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్.వీటి తర్వాత తమిళంలో బాగా ఆయనకు అవకాశాలు వస్తున్నాయి.అయితే హీరోగా సునీల్ అందుకున్న పారితోషికం కంటే విలన్ గా అందుకుంటున్న పారితోషికం చాలా తక్కువ అని సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.ఈ కమెడియన్ కమ్ విలన్ ప్రస్తుతం ఒక్కో తెలుగు సినిమాకి రూ.40 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం.కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో మాత్రం మంచి డిమాండ్ ఉండటం వల్ల రూ.60 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అంటే సంవత్సరానికి ఆయన ఈజీగా రూ.5 కోట్లు సంపాదిస్తున్నారు.ఒక్కో సినిమాకి తీసుకుంటున్న శాలరీ తక్కువ అయినా ఆయన ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి స్మాల్ – మీడియం రేంజ్ హీరోకి ఏ మాత్రం తీసుకోకుండా సునీల్ సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ మంచి విలన్ గా సునీల్ క్లిక్ అయితే ఆయన రెమ్యూనరేషన్ కోట్లకు చేరుకోవచ్చు.అదే జరిగితే ఈ నటుడు ఆదాయం మరింత పెరుగుతుంది.