వీడియో వైరల్: రోడ్డుపై బైక్ హ్యాండిల్ పట్టుకోకుండా డేంజర్ స్టంట్స్ చేస్తున యువతి..

ఈ మధ్యకాలంలో కొందరు యువత రోడ్డుపై బైక్స్ తో రకరకాల స్టంట్స్ చేస్తుండడం పరిపాటిగా మారిపోయింది.ఈ ప్రయత్నంలో కొందరు వారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు.

 Pune Woman Rides Bike Hands-free For Deadly Stunt Video Viral Details, Viral Vid-TeluguStop.com

మరికొందరు రోడ్డుపై బైకుతో విన్యాసాలు( Bike Stunts ) చేసిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ప్రాంతాలు ఏరియా పోలీసులు వారికి భారీ జరిమాణాలు విధించిన సంఘటనలు కూడా లేకపోలేదు.ఈ నేపథ్యంలో తాజాగా ఓ అమ్మాయి సంబంధించిన బైక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియో( Viral Video ) సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

పూణే నగరంలోని ఓ అమ్మాయి బైక్ పై( Bike ) చేస్తున్న స్టంట్స్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఓ యువతి బైక్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.మాధవి కుమార్ అనే ఆ యువతీ బైక్ చేతులు వదిలేసి బైకులు నడుపుతున్న దృశ్యాలు మనకు వీడియోలో కనపడతాయి.

కేవలం రీల్స్ కోసమే మాధవి( Madhavi ) ఈ ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసినట్లు అర్థమవుతుంది.ఆ అమ్మాయి ప్రముఖ యూట్యూబర్.ఇప్పటికే ఆమెకి 1 .6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా దాంతో మాధవి మరింత ఫాలోవర్లను పెంచుకునే ఉద్దేశంతో ఈ రకపు విన్యాసాలను చేసింది.

మాధవి రోడ్డుపై చూడకుండా బైకుపై ఒకే పక్క మాత్రమే కూర్చుని రైడ్ చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది.ఈ ప్రయాణంలో ఆవిడ ఒక వైపుకు మాత్రమే కూర్చుని నడుపుతుండడం ఆశ్ఛర్యం కలిగిస్తుంది.అంతేకాదు రైడింగ్ సమయంలో కూడా డాన్స్ చేసినట్లుగా వీడియో కనపడుతుంది.ఇక ఈ వీడియోని చూసి చాలామంది ఆమెను సపోర్ట్ చేస్తుంటే.మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.ఫేమస్ అయ్యేందుకు ప్రాణాలని ఇలా ప్రాణంగా పెట్టడం అవసరమా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube