1.గూగుల్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు
మహారాష్ట్రలోని పూణే సిటీ గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది.ఆఫీస్ ఆవరణలో బాంబు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇదంతా ఫేక్ కాల్ అని తేల్చారు.
2.తెనాలి మున్సిపల్ ఉద్యోగుల నిరసన
తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.మున్సిపల్ బిల్ కలెక్టర్ రషీద్ పై కౌన్సిలర్ తన అనుచరులతో దాడి చేయడం తో ఈ నిరసన చేపట్టారు.
3.వైసీపీలో చేరిన టిడిపి మాజీ ఎమ్మెల్యే
ఏలూరు జిల్లా కైకలూరు టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు.
4.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.కోర్టుకు చెప్పకుండా మాస్టర్ ప్లాన్ పై నిర్ణయం తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు 15 కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు.
6.బిజెపిది విచ్చన్నకర పాలన
కేంద్రంలోని బిజెపిది విచ్ఛిన్నకర పాలన ఉందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు.
7.కెసిఆర్ పై కిషన్ రెడ్డి కామెంట్స్
దేశ ఆర్థిక పరిస్థితి పై తెలంగాణ సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
8.వంగవీటి పేరు పెట్టాలి
కృష్ణ మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని రాజ్యసభలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.
9.కెసిఆర్ పై కేఏ పాల్ కామెంట్స్
ప్రజాశాంతి పార్టీ నేత కే ఏ పాల్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తారని పాల్ జోస్యం చెప్పారు.
10.నేడు వైసిపి విస్తృతస్థాయి సమావేశం
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసులో వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జగన్ సమావేశం నిర్వహించనున్నారు.
11.గవర్నర్ ను కలిసిన జగన్
ఏపీ సీఎం జగన్ ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్రన్ తో ఈరోజు ఉదయం సమావేశం అయ్యారు.
12.వైమానిక ప్రదర్శన ప్రారంభించిన ప్రధాని
నేడు వైమానిక ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించారు.
13. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు నేటి తో ఆఖరు
నేటితో పట్టబద్దలు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియనుంది.
14.సింహాచలంలో రామ్ చరణ్ షూటింగ్
విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఈరోజు రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ జరగనుంది.
15.బీసీల జనగణన జరగాలి
కేంద్రం తక్షణమే బీసీల జనగణన జరపాలని ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
16.అమర్నాథ్ ఆస్తులపై విచారణ జరగాలి
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టిడిపి నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి .ఈ సందర్భంగా అమర్నాథ్ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని టిడిపి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి బుద్ధ వెంకన్న సవాల్ విసిరారు.
17.జాతీయ రహదారి ప్రారంభం
ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి తొలి దశ పూర్తి కావడంతో ప్రధాని నేడు ప్రారంభించనున్నారు.
18.జగన్ సీఎం కావాలని బైక్ యాత్ర
ఏపీ సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన వీర బాబు అనే యువకుడు బైక్ యాత్ర చేపట్టారు.
19.నూతన గవర్నర్ కు జగన్ అభినందనలు
ఏపీ గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,500
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 57,230
.