జో బైడెన్ కొత్త ఓవర్‌టైమ్ పే రోల్‌పై రిపబ్లికన్ల దావా.. న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌( President Joe Biden ) తీసుకున్న ఓ అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాన్ని టెక్సాస్‌లోని ఓ ఫెడరల్ న్యాయమూర్తి నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.దేశంలో 4 మిలియన్ల మంది కార్మికులకు తప్పనిసరి ఓవర్‌టైమ్ వేతనం అమల్లోకి రాకుండా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రూల్‌ను నిరోధించాలని దావా వేశారు.

 Texas Us Judge Skeptical Of President Biden’s Overtime Pay Rule , Texas , Pre-TeluguStop.com

అయితే న్యాయమూర్తి దానిని దేశవ్యాప్తంగానా లేక రిపబ్లికన్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రంలో మాత్రమే అడ్డుకుంటారా అనేది ఖచ్చితంగా తెలియదు.టెక్సాస్‌‌లోని షెర్మాన్‌‌లో ఉన్న యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జస్టిస్ సీన్ జోర్డాన్ .యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ఫెడరల్ వేతన చట్టాన్ని ఉల్లంఘించిందని , ఉద్యోగ విధుల కంటే వేతనాలు పొందే కార్మికులకు ఓవర్‌టైమ్ చెల్లింపుకు అర్హతగా పెట్టారని పేర్కొన్నారు.

రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హయాంలో జస్టిస్ జోర్డాన్‌ను( Justice Jordan ) న్యాయమూర్తిగా నియమించారు.

రిపబ్లికన్ టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్‌టన్ కార్యాలయం ద్వారా దాఖలు చేసిన స్టేట్ వ్యాజ్యం ప్రకారం జూలై 1 వరకు ఈ నిబంధన అమల్లోకి రాకుండా ఆపివేయాలని చేసిన తీర్మానాన్ని న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు.వారానికి 1,128 డాలర్లు కంటే తక్కువ లేదా ఏడాదికి 58,600 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్న వేతన కార్మికులు .వారానికి 40 గంటల కంటే ఎక్కువ పనిచేసినప్పుడు యజమానులు ఓవర్‌టైం ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది.అయితే 2019లో రూపొందించిన ప్రస్తుత థ్రెషోల్డ్ 35,500 డాలర్లు.

Telugu Jordan, Joe Biden, Republicantexas, Texas, Texasjudge-Telugu NRI

అయితే ఫెడరల్ చట్టం .ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ప్రొఫెషనల్ విధులను కలిగి ఉన్న కార్మికులకు ఓవర్‌టైమ్ వేతనం నుంచి మినహాయింపు ఇస్తుంది.లేబర్ డిపార్ట్‌మెంట్ దశాబ్ధాలుగా అది ఎప్పుడో వర్తిస్తుందో నిర్ణయించేందుకు జీతాన్ని ఒక అంశంగా పరిగణిస్తూ వస్తోంది.సోమవారం నాడు దాదాపు 90 నిమిషాల పాటు సాగిన విచారణలో.

కొత్త నిబంధన థ్రెషోల్డ్‌ను గణనీయంగా పెంచుతుందని జస్టిస్ జోర్డాన్ అన్నారు.ఇది చట్టం ప్రాథమిక దృష్టి అయినప్పటికీ కార్మికుల విధులను అసంబద్ధం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రతి కేసు జీతం ద్వారా నిర్ణయించబడదు, నిర్ధిష్ట జీతం పొందని వ్యక్తులను కలిగి ఉండవచ్చు, లేదా మినహాయింపును పొందగలరని వారు ఆశించవచ్చని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

Telugu Jordan, Joe Biden, Republicantexas, Texas, Texasjudge-Telugu NRI

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయవాది బ్రియాన్ రోసెన్ స్చౌడ్( Brian Rosen Schaud ) మాట్లాడుతూ కార్మిక శాఖ.వేతనాలతో సమానంగా కార్మికుల విధులను చూస్తుందన్నారు.న్యాయమూర్తి ఈ నియమాన్ని దేశవ్యాప్తంగా నిరోధించాలా లేదా టెక్సాస్‌లోని రాష్ట్ర ఉద్యోగులకు వర్తించకుండా లేబర్ డిపార్ట్‌మెంట్‌ను మాత్రమే నిషేధించాలా అనే దాని గురించి కసరత్తు చేస్తున్నారు.

టెక్సాస్ తరపున న్యాయవాది గారెట్ గ్రీన్ మాట్లాడుతూ.ఈ నిబంధన ఎక్కడా అమల్లోకి రాకుండా ఆపాలని, ఏజెన్సీ రూల్‌మేకింగ్‌ను నియంత్రించే ఫెడరల్ చట్టం కోర్టులకు అలాంటి అధికారాన్ని ఇస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube