కిడ్నీలలోనే కాకుండా ఇతర శరీర భాగాల్లో కూడా రాళ్లు ఉంటాయా..

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలలో కిడ్నీలలో రాళ్ళు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.కానీ మన శరీరంలో ఇంకొన్ని భాగాల్లో కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని చాలామంది ప్రజలకు తెలియదు.

 Are There Stones In Other Parts Of The Body Apart From The  Kidneys   Kidneys ,s-TeluguStop.com

అసలు కిడ్నీలలో కాకుండా ఇంకా ఏ శరీర భాగాల్లో రాళ్లు ఏర్పడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో కిడ్నీలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవడం మంచిది.కిడ్నీ సమస్యలు అంటే సహజంగా గుర్తు వచ్చేది కిడ్నీలో రాళ్లు ఉండడం మాత్రమే.

కిడ్నీలలో రాళ్లు ఏర్పడడం ప్రమాదకరమే కానీ ఇవే రాళ్ళు శరీరంలో ఇతర అవయవాల్లో కూడా ఏర్పడుతూ ఉంటాయి.

వీటిని ఎప్పటికప్పుడు గుర్తించకపోతే ప్రాణానికే ప్రమాదం.

కిడ్నీలలో రాళ్లు అనేవి అందరికీ తెలిసిందే.జీవనశైలి సరిగ్గా లేకపోవడం, అధిక బరువు, మందులు ఎక్కువగా వాడడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం అనేది కిడ్నీలలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం అవుతుంది.

కిడ్నీలలో రాళ్ల సమస్య ఉంటే భరించలేనంత నొప్పి ఉంటుంది.అయితే పిత్తాశయం సంచిలో కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

పిత్తాశయం సంచి అనేది లివర్కు దిగిన కుడివైపు ఉంటుంది.నాలికలో ఏదైనా అవరోధం ఏర్పడినప్పుడు ఈ సమస్య వస్తుంది.

పితాశం సంచిలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది రాయి రూపంలో మారే అవకాశం ఉంది.ఫలితంగా తీవ్రమైన, భరించలేని నొప్పి ఏర్పడే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది.కడుపు నొప్పి, ఛాతిలో మంట, కడుపు భారంగా ఉండడం, అజీర్ణం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతో మంచిది.ఎందుకంటే కిడ్నీలో రాళ్లు ఎంత ప్రమాదమో ఇవి కూడా అంతే ప్రమాదకరం తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే వైద్యం చేయించుకోవడం ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube