ఆచార్య చాణక్యుడు తన ఆలోచనలను దండగా గుచ్చడం ద్వారా అమూల్యమైన నీతిని రూపొందించాడు.చాణక్యుడు తెలిపిన విధానాలు నేటికీ అనువైవిగా ఉన్నాయి.
వాటిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలు వివరంగా అందించారు.అలాంటి ఒక విధానంలో ఆచార్య చాణక్యుడు తెలియజేసినదాని ప్రకారం మీరు లక్ష్యం వైపు వెళుతున్నప్పుడు, మీకు ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా మీరు భయపడవద్దని చెప్పారు.
కష్టాలు మనలను బలపరుస్తాయి.ఫలితంగా మనం సమస్యలను తేలికగా ఎదుర్కొంటామని చాణక్య తెలిపారు.
దీని గురించి ఆచార్య చాణక్య మరిన్ని వివరాలు తెలియజేస్తూ మనిషి లేనిపోని సాకులు వెదకడం కంటే తన కలలను సాకారం చేసుకున్నప్పుడే విజయం సాధిస్తాడని తెలిపారు.ఒక వ్యక్తి తన మనస్సును తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలని, ప్రతి సందర్భంలోనూ పూర్తి శక్తితో బలంగా పోరాడాలని చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా వివరించాడు.
అవకాశాలను ఎప్పుడూ వదులుకోవద్దు.ఎప్పటికీ అవకాశాలను వదులుకోని వ్యక్తి ఏదో ఒక రోజు విజయం సాధించడం ఖాయమని ఆచార్య తెలిపారు.యుద్ధ రంగంలో ఓటమి ఎదురైతే, దానిని తిరిగి సవాలుగా స్వీకరించి, ఆ వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు.అయితే మనిషి తన మనస్సులోనే ఓడిపోతే, అతను ఎప్పటికీ గెలవలేడని తెలిపారు.
జీవితం ఒడిదుడుకులతో కూడుకున్నదని ఆచార్య చాణక్యుడు తెలిపారు.అటువంటి పరిస్థితిలో మీరు మీ లక్ష్యం వైపు వెళ్ళినప్పుడు, ఆ మార్గంలో అనేక క్లిష్ట పరిస్థితులను, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టంగా గ్రహిస్తారని చాణక్య తెలిపారు.
ఈ సమస్యలకు భయపడి ఎప్పటికీ ఔన్నత్యాన్ని తాకలేక ముందే వదులుకునే వారు వైఫల్యం చెందుతారని చాణక్య తెలిపారు.కష్టాలు మీ ముందుకు వచ్చినప్పుడు, ఓటమి అన్ని వైపుల నుండి చుట్టుముట్టినప్పుడ, మీ మనస్సును నియంత్రించాలని చాణక్య సూచించారు.

అటువంటప్పుడు సావధానంగా మీ గమ్యం వైపు పయనిస్తూ ఉండాలని అని చాణక్యుడు సూచించాడు.పదే పదే పడి లేచి నిలబడే వ్యక్తికి ఆత్మవిశ్వాసం చాలా రెట్లు పెరుగుతుందన్నాడు.మీ గమ్యాన్ని చేరుకోవాలనే మీ కృషి, సంకల్పం ఓటమిని కూడా విజయంగా మారుస్తుందని తెలిపాడు.మీరు విజయం సాధించినప్పుడు, మీ ఆనందం రెట్టింపు అవుతుంది.గెలుపు, ఓటములను ఎవరూ నిర్ణయించలేరు, సరైన నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేది మీనిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.ఇదేవిధంగా ఆచార్య చాణక్యుడు.
మీరు జీవితంలో ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా సరే.ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగితే, వారిని ఎప్పుడూ తిరస్కరించవద్దని సూచించారు.ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి మనసును పొందుతారని చాణక్య తెలిపారు.ఈ అలవాటు కారణంగా, అందరూ మిమ్మల్ని అభిమానిస్తారని చాణక్య సూచించారు.వృద్ధాప్యంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాణక్య తెలిపారు.







