పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్..? ట్వీట్ వైరల్..

నివేత థామస్ ( Nivetha Thomas ).ఈ ప్రముఖ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

 The Tweet Of The Heroine Who Is About To Get Married Is Viral , Niveda Thomas, V-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో నటించి భారీ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ రాను రాను కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది ఈ కేరళ చిన్నది.ఇకపోతే ఈ అమ్మడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పవచ్చు.

నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది నివేదిత.తెలుగు సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసింది ఈ అందాల బొమ్మ.

ఆ తర్వాత రెండో సినిమాను కూడా నానితోనే భారీ విజయాన్ని అందుకుంది.

నివేదిత కేవలం హీరోయిన్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది.రజనీకాంత్( Rajinikanth ) హీరోగా నటించిన దర్బార్ సినిమాలో ఆయన కూతురిగా నటించి అందరి మన్నలను పొందింది.అంతేకాదు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లీడ్ రోల్ లో నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో నివేదిత ఓ హీరోయిన్గా నటించి మెప్పించింది.

అయితే సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ చాలా గ్యాప్ తీసుకుంది.చివరిసారిగా ఆవిడ షాకిని.డాకిని.అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా పెద్దగా ప్రజలను మెప్పించలేకపోయింది.

ఇకపోతే ప్రస్తుతం ఆమె చేసిన లేటెస్ట్ పోస్ట్ చాలా వైరల్ గా మారింది.మరి నివేద థామస్ చేసిన పోస్టులో ఏముందంటే.“చాలా కాలం గడిచిపోయింది.బట్.ఫైనల్లీ.” అంటూ ఆవిడ రాసుకోవచ్చింది.చివరిలో లవ్ ఎమోజిని కూడా యాడ్ చేసింది.

దీంతో ఈ పోస్ట్ పై రకరకాలుగా నెటిజెన్స్ స్పందిస్తున్నారు.అతి త్వరలో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కబోతుందని అంటూ కామెంట్స్ చేస్తుండగా.

మరి కొంతమంది కొత్త సినిమాని ప్రమోషన్ కోసం ఇలా చేసిందేమో అంటూ భిన్నాభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా పూర్తి వివరాల కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube