జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు వాడి బాగా విసిగిపోయారా.? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగడం లేదా.? అయితే మీరు కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ టానిక్ ను వాడాల్సిందే.ఈ టానిక్ జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా బాగా పండిన ఒక చిన్న పైనాపిల్( Pineapple ) ను తీసుకుని తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ ముక్కలు వేసి ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పైనాపిల్ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ లో అరకప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

ఈ టానిక్ గా ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.అరగంట అనంతరం తేలిక పాటి షాంపూతో తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఇలా చేశారంటే మీ జుట్టు ఊడమన్నా ఊడదు.
పైనాపిల్ మరియు కొబ్బరి పాలలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ళను స్ట్రాంగ్ గా మారుతాయి.జుట్టు రాలడాన్ని క్రమక్రమంగా దూరం చేస్తాయి.
అలాగే పైనాపిల్ మరియు కొబ్బరి పాలతో తయారు చేసుకున్న ఈ హెయిర్ టానిక్ ను వారానికి ఒకసారి వాడటం వల్ల కురులు ఆరోగ్యంగా షైనీగా మారతాయి. జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుతాయి.
కాబట్టి అధిక హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ హెడ్ టానిక్‌ను వాడేందుకు ప్రయత్నించండి.







