ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే.కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది.
ఈ ఓటమి అనంతరం వైసీపీ పై దారుణమైన విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ప్రత్యర్థులు వైసీపీ పార్టీని వైయస్ జగన్.
( YS Jagan.).కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.తాజాగా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( DK Shivakumar )తో వైయస్ జగన్ చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ విలీనం చేయటానికి రెడీ అవుతున్నట్లు వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani )స్పందించారు.కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్( Congress Party ) ను 16 నెలలు జైల్లో పెట్టిందని గుర్తు చేశారు.అలాంటి అటువంటి పార్టీలో ఎలా చేరుతారు అంటూ ప్రశ్నించారు.కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.వైసీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.ఇలాంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని తెలియజేశారు.
ఇప్పుడు ఓడిపోయిన మళ్లీ ఎన్నికలలో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.వచ్చే ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లి నుంచి ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తారని పేర్ని నాని స్పష్టత ఇవ్వటం జరిగింది.