సమంత ఇల్లుని చూశారా.. ఇంద్రభవనమే..!

చిత్ర పరిశ్రమలో నటి సమంత గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 Samantha New House Is Amazing Check Pics, Samantha , Nagachaitanya, House, Mural-TeluguStop.com

నాగ చైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలైంది సమంత.ఈ జంటను అభిమానించే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు.

ఇక ఎప్పడు ఈ జంట గురించి తెసులుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.అయితే పెళ్లికి ముందు విడివిడిగా ఉన్న వీళ్లిద్దరు పెళ్లి తర్వాత ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు.

అయితే ఆ ఇంటికి ఉన్న స్పెషాలిటీ లు అన్నీ ఇన్నీ కావట సింపుల్ గా చెప్పాలంటే ఇంద్ర భవనానికి ఏమీ తక్కువ కాకుండా సమస్త సదుపాయాలు ఇంటిలో ఉన్నాయని అంటున్నారు.

ఇక ఈ ఇంటిని కొనడానికి చైతన్య సమంతలు పెద్ద యుద్ధమే చేశారట.

యుద్ధం అంటే ఏమిటో అనుకునేరు అదేంటంటే ఈ ఇంటి కోసం వెతుకులాటలో వీరికి చాలా రోజులు గడిచి పోయాయని అంటున్నారు.ఈ ఇద్దరు కలిసి ఎన్నో ఇళ్ళు చూసినా వీరికి ఆ ఇంటిలో ఏదో ఒక లోపం కనిపించేదట.

సరిగ్గా అలాంటి సమయంలో మురళీమోహన్ కట్టించుకున్న ఇల్లు చూసిన నాగ చైతన్య తనకున్న చనువుతో ఆ ఇల్లు తనకు కావాలని కోరారట.

Telugu Murali Mohan, Nagachaitanya, Nagarjuna, Samantha-Telugu Stop Exclusive To

అయితే మురళీమోహన్ మాత్రం ఇది అమ్మేందుకు కాదని తన తమ్ముడికి, కొడుక్కి బాగా ఇష్టమైన ఇల్లని అందుకే దాన్ని అసలు అమ్మే ఉద్దేశం లేదని చెప్పాడట.వెంటనే ఈ విషయాన్ని తండ్రి నాగార్జునకు తెలియ చెప్పటంతో ఆయన విషయమంతా వివరించి ఇది తప్ప మరే ఇల్లు ఆ కొత్త జంటకి నచ్చలేదని.ఈ ఇంటిని ఎలా అయినా ఇవ్వాలని మురళీమోహన్ ని కోరారట.

నాగార్జున రంగంలో దిగి అడగడంతో మురళీ మోహన్ ఆయన మాట కాదనలేక మనసు మార్చుకోవాలి వచ్చిందట.గచ్చిబౌలి ఏరియాలో 14వ ఫ్లోర్ లో ఉండే ఈ ఇంట్లో సమస్త సదుపాయాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube