తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి సిటీలో( Tirunelveli City ) ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ఒక కోర్టు ఉద్యోగి మృతి చెందారు.
ఈ ఘటన నగరంలోని వన్నారపేటై ప్రాంతంలో జరిగింది.వేలుయుధరాజ్ అనే కోర్టు ఉద్యోగి తన మోటార్ సైకిల్‌పై కోర్టు ఆదేశాలను పంపిణీ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
వన్నారపేటై రహదారిపై వెళ్తున్నప్పుడు, రోడ్డుపై పోట్లాడుకుంటున్న రెండు ఆవులు అతనిని ఒక రన్నింగ్ బస్సు కిందకు నెట్టివేశాయి.ఈ ఘటనలో వేలుయుధరాజ్ అక్కడికక్కడే మృతి చెందారు.
అది తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (TNSTC)కు చెందిన బస్సు అని తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీనిలో, రెండు ఆవులు రోడ్డుపై కుమ్ముకుంటున్నట్లు, ఆ తర్వాత బండి పై వెళ్తున్న వేలుయుధరాజ్‌ను ( Velyudharaj )బస్సు కిందకు నెట్టివేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.ఈ దురదృష్ట ఘటన నేపథ్యంలో, తిరునల్వేలి నగరపాలక సంస్థ నగరంలో సంచరించే ఆవులను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది.
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ డ్రైవ్‌లో 47 ఆవులు స్వాధీనం చేసుకున్నారు.వీటి యజమానులపై జరిమానా విధించబడుతుందని అధికారులు తెలిపారు.యజమానులు తమ జంతువులను ఇళ్లలోనే ఉంచాలి, లేకపోతే వాటిని స్వాధీనం చేసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.అలాగే వీటి యజమానులపై ఫైన్ విధిస్తామని ఒక వార్నింగ్ ఇచ్చారు.
ఇకపోతే భారతదేశ వ్యాప్తంగా ఆవుల దాడులు చాలా ఎక్కువ అవుతున్నాయి.ఇవి చిన్నపిల్లలు ఆడవారిపై దాడులు చేస్తూ వారి మరణానికి కారణమవుతున్నాయి.ఈ సమస్యలను పరిష్కరించే ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.వీటి కారణంగా చాలా మంది కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి కూడా నెలకొన్నది.మరి ప్రభుత్వాలు ఇంకెప్పుడు ఈ సమస్యలపై స్పందిస్తాయో తెలియాల్సి ఉంది.